కొవిడ్‌తో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు రూ.3 లక్షల చెక్కులు అందజేత

ABN , First Publish Date - 2021-10-28T05:18:56+05:30 IST

కొవిడ్‌తో మృతి చెందిన పోలీసు కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చె క్కును బుధవారం ఎస్పీ అన్బురాజన్‌ అందచేశారు.

కొవిడ్‌తో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు   రూ.3 లక్షల చెక్కులు అందజేత
పోలీసు అధికారుల కుటుంబీకులకు చెక్‌ అందజేస్తున్న ఎస్పీ

కడప(క్రైం), అక్టోబరు 27: కొవిడ్‌తో మృతి చెందిన పోలీసు కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చె క్కును బుధవారం ఎస్పీ అన్బురాజన్‌ అందచేశారు. హోం మంత్రి ఎం.సుచరిత, డీజీపీ డి.గౌతంసవాంగ్‌, ఇతర రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, మ్యాన్‌కైండ్‌ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో కలిసి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్‌ నియంత్రణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి, అధికారులకు మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ సహాయం చేసిన చెక్కులను ఆయా బాధిత కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్‌ అందజేశారు. జిల్లాలో కొవిడ్‌ నియంత్రణ విధుల్లో అశువులబాసిన ఎస్‌ఐ రామకృష్ణ, ఏఎ్‌సఐ వెంకటయ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ రవిచంద్ర, మధుసూదన్‌రాజు, కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున చెక్కులను ఎస్పీ అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ (ఆపరేషన్‌) ఎం.దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, ఏఏవో కృష్ణుడు, ఆర్‌ఐలు మహబూబ్‌బాషా, జార్జ్‌, వీరేష్‌, సోమశేఖర్‌నాయక్‌, పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్‌, గౌరవాధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, కోఆప్షన్‌ సభ్యులు బండారు రామకృష్ణ, ఈసీ సభ్యులు ఏఫ్రిన్‌, శివకుమారి, లక్ష్మీదేవి, పోలీసు, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T05:18:56+05:30 IST