Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోషకాలతో కరోనా దూరం!

ఆంధ్రజ్యోతి(08-09-2020)

కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షించే ప్రత్యేకమైన పదార్థాలు అంటూ లేకపోయినా, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు రోగనిరోధకశక్తిని పెంచి కరోనా సోకినా, శరీరం మీద దాని ప్రభావం తగ్గించడానికి తోడ్పడతాయి. కాబట్టి పోషకభరిత ఆహారం మీద దృష్టి పెట్టాలి!


పొట్టు తొలగించి, పాలిష్‌ పట్టిన పదార్థాల్లో క్యాలరీలు శూన్యం. ఫలితంగా ఆకలి తీరినా శక్తి సమకూరక, తేలికగా రోగాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. పులిసిన పదార్థాలు పోషక శోషణకు తగ్గట్టు పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పప్పుధాన్యాలు, సీజన్‌వారీ కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, చర్మం తొలగించిన చికెన్‌, చేపలు పరిమితంగా తీసుకోవాలి. పొట్టు తీయని ధాన్యాలు పిండిపదార్థాలు, మాంసకృత్తులను సమకూరుస్తాయి. కూరగాయలు, పండ్ల ద్వారా విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ప్రతి రోజూ నట్స్‌ తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.


నట్స్‌, నూనెతో కూడిన విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి. పీచు, మాంసకృత్తులు, అన్నిటికంటే ముఖ్యంగా శరీరం నుంచి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించే యాంటీఆక్సిడెంట్లు దొరకుతాయి. అలాగే కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సూప్స్‌, పుదీనా నీళ్లు, జీలకర్ర నీళ్లు లాంటి పానీయాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. వ్యాధులను కలుగజేసే క్రిములతో వ్యాధినిరోధకశక్తి సమర్థంగా పోరాడాలంటే అందుకు తగిన పోషకాహారం తీసుకోవాలి. కాబట్టి సమతులాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అప్పుడే కొవిడ్‌ నుంచి పూర్తి రక్షణ పొందగలం!


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...