చేనేత సొసైటీలకు త్రీమెన్‌ కమిటీ పెట్టాలి

ABN , First Publish Date - 2020-08-11T11:14:15+05:30 IST

చేనేత సొసైటీలకు త్రీమెన్‌కమిటీ ఏర్పాటు చేయాలని జమ్మలమడుగుకు చేనేత సంఘం నియోజకవర్గ కార్యదర్శి దుద్యాల

చేనేత సొసైటీలకు  త్రీమెన్‌ కమిటీ పెట్టాలి

జమ్మలమడుగు రూరల్‌, ఆగస్టు 10: చేనేత సొసైటీలకు త్రీమెన్‌కమిటీ ఏర్పాటు చేయాలని  జమ్మలమడుగుకు చేనేత సంఘం నియోజకవర్గ కార్యదర్శి దుద్యాల రమేష్‌ చేనేత, జౌళీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆమేరకు ఆయన మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 76 శిల్క్‌సొసైటీ సహకార సం ఘాలకు పాలక వర్గాల కాలపరిమితి ఈనెల 20వ తేదీ నాటికి ముగుస్తున్నదని, అలాగే కాటన్‌ చేనేత సహకార సంఘాలకు దాదాపు 120 సొసైటీలకు ఈనెల 10వ తేదీ పర్సన్‌ ఇన్‌ఛార్జి కాలపరిమితి ముగుస్తోందన్నారు.


సొసైటీలకు పర్సన్‌ ఇన్‌ఛార్జిలు ఉండటం వలన సంఘాల్లోని చేనేత కార్మికులకు, వారి వ్యాపార కార్యకలాపాలకు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఒక పర్సన్‌ ఇన్‌ఛార్జి 15 నుంచి 20 సంఘాలకు ఉండటం వలన సొసైటీలకు అందుబాటులో ఉండటంలేదన్నారు. చేనేత కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కరోనా పరిస్థితుల వలన ఇబ్బందిపడుతున్న శిల్క్‌, కాటన్‌ చేనేత సంఘాలకు పర్సన్‌ ఇన్‌ఛార్జిలను రద్దు చేసి నాన్‌ అఫీషియల్‌ త్రీమెన్‌ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-11T11:14:15+05:30 IST