వీడని ముంపు

ABN , First Publish Date - 2020-10-15T09:54:29+05:30 IST

భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఇంకా పొంగి ప్రవహిస్తున్నాయి. చింతలపూడి సమీపంలోని తమ్మి లేరు రిజర్వాయర్‌కు క్రమేపీ వరద తగ్గుతోంది. తమ్మిలేరు రిజర్వాయర్‌ రెగ్యులేటర్‌ దిగువన ఉన్న ఆర్‌అండ్‌బీ వంతెన పక్కన గండి పడడంతో పోలీ సులు రాకపోకలు నిలుపుదల చేశారు.

వీడని ముంపు

రోడ్లకు గండ్లు, ముంపు బారిన పొలాలు 

 తమ్మిలేరు వంతెనపై రాకపోకలు నిలుపుదల 

  వేలాది ఎకరాల్లో పంట నష్టం 


చింతలపూడి/బుట్టాయగూడెం/జీలుగుమల్లి/టి.నరసాపురం/ పోలవరం, అక్టోబరు 14 : భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు ఇంకా పొంగి ప్రవహిస్తున్నాయి. చింతలపూడి సమీపంలోని తమ్మి లేరు రిజర్వాయర్‌కు క్రమేపీ వరద తగ్గుతోంది. తమ్మిలేరు రిజర్వాయర్‌ రెగ్యులేటర్‌ దిగువన ఉన్న ఆర్‌అండ్‌బీ వంతెన పక్కన గండి పడడంతో పోలీ సులు రాకపోకలు నిలుపుదల చేశారు. కాగా పలు మండలాల్లో మొత్తం 1755 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయాధికారులు బుధవారం తెలి పారు. బుట్టాయగూడెం మండలంలో సుమారు 350 ఎకరాల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయని ఇన్‌చార్జి ఏవో సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. సీతారామ నగరంలో వర్షాలకు దెబ్బతిన్న మిరప పంటను ఆయన పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


శ్రీగుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం గేట్లను బుధవారం మూసివేశామని ఇరిగేషన్‌ ఏఈ కిరణ్‌ తెలిపారు. వర్షాలు తగ్గి జలాశయానికి ఇన్‌ఫ్లో తగ్గడం వల్ల గేట్లను మూశా మన్నారు. వర్షాలు కురిస్తే గేట్లను ఎత్తుతామని, ప్రస్తుతం పూర్తిస్థాయిలో నీటి మట్టం ఉందన్నారు. జీలుగుమల్లి మండలంలో 245 ఎకరాల్లో ప్రత్తి, వేరు శెనగ, వరి పంటలు దెబ్బతిన్నాయని ఏవో కె.పార్వతి తెలిపారు. టి.నర సా పురం మండలంలో 527 ఎకరాల్లో పంటలు నీట మునిగాయని ఏవో డి.ము త్యాలరావు తెలిపారు. కొయ్యలగూడెం మండలంలో 625 ఎకరాల్లో వరి, 8 ఎకరాల్లో వేరు శెనగ పంట నష్టం వాటిల్లిందని ఏవో చెన్నకేశవులు తెలి పారు. పోలవరం మండలంలో బుధవారం ఈదురుగాలు లతో కూడిన భారీ వర్షం కురిసింది. పల్లపు ప్రాం తాలు జలమయం అయ్యాయి.


బెస్తా వీధిలో వర్షపునీరు బయటకు వెళ్లే మార్గం లేక నీరు నిల్వ ఉండడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. గుటాల, కొత్తపట్టిసీమ, పట్టిసీమ, బాపూజీ కాలనీల్లో నివాసాలు చుట్టూ చేరి జలాశ యాలను తలపిస్తున్నాయి. వింజరం వద్ద గోవిందరాజుల చెరువు కొండవాగులతో నిండి పంట పొలాలను ముంచివేసింది. తహసీల్దార్‌ సుమతి, ఎస్‌ఐ శ్రీను దెబ్బతిన్న కల్వర్టులను పరి శీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

 

తమ్మిలేరుకు ఐదుసార్లు వరద 

చింతలపూడి, అక్టోబరు 14 : తమ్మిలేరు రిజర్వాయర్‌కు 1978, 1989, 1996, 2012, 2020 అధికస్థాయిలో వరద వచ్చి చేరింది. తమ్మిలేరు రిజర్వాయర్‌ రెగ్యులేటర్‌ దిగువనవున్న వాగుపై వంతెన ప్రమాదకరంగా ఉంది. పశ్చిమ, కృష్ణా జిల్లా సరిహద్దు ఈ వంతెనే. కృష్ణా వైపు వంతెన పక్కన గండి ఏర్పడి నీరుపోతోంది. వంతెన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. పోలీసులను అప్రమత్తం చేసి పశ్చిమ వైపు నుంచి రాకపోకలు నిలిపివేస్తూ బారికేడ్లు పెట్టారు. తమ్మిలేరు ప్రాజెక్టు చూడడానికి రావద్దని హె చ్చరికలు చేస్తున్నారు.

Updated Date - 2020-10-15T09:54:29+05:30 IST