గ్రామాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

ABN , First Publish Date - 2020-10-01T10:56:05+05:30 IST

గ్రామాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే అది మనచేతుల్లోనే ఉందని మనం- మనం పరిశుభ్రత కార్య క్రమం జిల్లా కో ఆర్డినేటర్‌ రాఘవన్‌ అన్నారు. భోగాపురంలో మనం- మన పరిశుభ్రతపై ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు.

గ్రామాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

 గ్రామస్థుల చేతుల్లోనే గ్రామ పరిశుభ్రత 

 మనం- మన పరిశుభ్రత జిల్లా కోఆర్డినేటర్‌ రాఘవన్‌ 


పెదవేగి, సెప్టెంబరు 30: గ్రామాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని, మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే అది మనచేతుల్లోనే ఉందని మనం- మనం పరిశుభ్రత కార్య క్రమం జిల్లా కో ఆర్డినేటర్‌ రాఘవన్‌ అన్నారు. భోగాపురంలో మనం- మన పరిశుభ్రతపై ప్రజలకు అవగాహనా సదస్సు నిర్వహించారు.  రాఘవన్‌ మాట్లాడుతూ అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామ సభలను ఏర్పాటు చేసి, మనం - మన పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.


గ్రామాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో అవగాహన కల్పించడం ద్వారా గ్రామ వికాసానికి అవకాశం ఉంటుందన్నారు. డివిజన్‌ కో ఆర్డినేటర్‌ బీహెచ్‌ఎన్వీ.కృష్ణంరాజు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు ఇంటింటికి వెళ్లి గ్రామ పరిశుభ్రతపై చైతన్యం కల్పించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈక్రమంలో చెత్త సేకరణలో ఏ మాత్రం అల సత్వం వహించినా ప్రజలు తక్షణమే ప్రశ్నించే వీలుంటుందన్నారు.


డంపింగ్‌ యార్డు దగ్గర అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, వర్మీ కంపోస్టు తయారీని చేపట్టనున్నట్టు తెలిపారు.  వర్మీకంపోస్టును పంచాయతీ ద్వారా విక్రయించి, పంచాయతీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కృష్ణంరాజు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎం.వెంకటరావు, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-01T10:56:05+05:30 IST