ఆదాయం కిందికి..ధరలు పైపైకి..

ABN , First Publish Date - 2020-09-28T11:57:47+05:30 IST

కరోనా కార ణంగా ఆదాయం దిగజారి పోతు ంటే.. ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతు న్నాయి. కనీస నియంత్రణ లేకపో వడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఉప్పు నుంచి పప్పు వరకూ.. నూనె నుంచి బియ్యం వరకూ కూరగాయల నుంచి పండ్ల వరకూ అన్ని రకాల ధరలు ఆకాశన్నం టుతున్నాయి.సామాన్య, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేని స్థాయికి పెరిగిపోతున్నాయి.

ఆదాయం కిందికి..ధరలు పైపైకి..

నలిగిపోతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం

గణపవరం, సెప్టెంబరు 27 : కరోనా కార ణంగా ఆదాయం దిగజారి పోతు ంటే.. ధరలు మాత్రం పైపైకి వెళ్లిపోతు న్నాయి. కనీస నియంత్రణ లేకపో వడంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఉప్పు నుంచి పప్పు వరకూ.. నూనె నుంచి బియ్యం వరకూ కూరగాయల నుంచి పండ్ల వరకూ అన్ని రకాల ధరలు ఆకాశన్నం టుతున్నాయి.సామాన్య, మధ్య తరగతి ప్రజలు తట్టుకోలేని స్థాయికి పెరిగిపోతున్నాయి. ఇక మందులదీ అదే పరిస్థితి.. మందుల దుకాణదారులు అయినకాడికి పెంచేసి అమ్మేస్తున్నారు.


కష్టాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. పెరిగిన ధరలతో మందులు కొనుగోలు చేయలేక మధుమేహం, రక్తపోటు వ్యాధిగ్రస్థులు సత మతం అవుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిత్యా వసర వస్తువుల ధరలపై దృష్టి సారించకపోవడంతో ధరలు ఇస్టానుసారం పెంచేసుకుంటున్నారు. వర్షాలు పుష్కలంగా పడుతున్నా కాయగూరల ధరలు సామాన్య ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయి. ఉల్లి కిలో రూ.50, పచ్చిమిర్చి రూ.80, బీర, వంకాయలు రూ.60, బెండా, దొండ రూ.40, చిక్కుళ్లు రూ.80, కాకరకాయ రూ.60,  టమోట రూ.60, గుడ్డు రూ. 6, ఆకు కూరల ధరలు గతంలో కంటే   పెరిగాయి. ఇదే బాటలో నూనెలు, పప్పు ధరలు కొనసాగుతున్నాయి. ఇప్పటి కైనా ప్రభుత్వం దృష్టి ధరలను అదుపుచేయాలని ప్రజలు కోరుతున్నారు.  

Updated Date - 2020-09-28T11:57:47+05:30 IST