కష్టం కన్నీరుగా మిగిలింది!

ABN , First Publish Date - 2020-09-28T11:55:59+05:30 IST

ఆరుగాలం శ్రమ నీటిపాలైంది. మరో పది రోజుల్లో పంట చేతికి వస్తుం దన్న తరుణంలో ఆనందం కళ్లెదుటే ఆవిరైపోయింది. కష్టం కన్నీరుగా మిగిలింది.ఈ ఏడాది ఇదీ ఎర్రకాలువ పరీవాహక రైతాంగానికి సార్వా సాగు మిగిల్చిన నష్టం. ఇటీవల ఎర్రకా లువ వదరదలకు వేలాది ఎకరాల పంట మట్టి పాలైపో యింది.

కష్టం కన్నీరుగా మిగిలింది!

తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలాల్లో   7,500 ఎకరాల్లో పంట నష్టం

 లబోదిబోమంటున్న రైతాంగం


తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 27 : ఆరుగాలం శ్రమ నీటిపాలైంది. మరో పది రోజుల్లో పంట చేతికి వస్తుం దన్న తరుణంలో ఆనందం కళ్లెదుటే ఆవిరైపోయింది.  కష్టం కన్నీరుగా మిగిలింది.ఈ ఏడాది ఇదీ ఎర్రకాలువ పరీవాహక రైతాంగానికి సార్వా సాగు మిగిల్చిన నష్టం. ఇటీవల ఎర్రకా లువ వదరదలకు వేలాది ఎకరాల పంట మట్టి పాలైపో యింది.తాడేపల్లిగూడెం, నిడదవోలు మండలా లకు చెందిన వేలాది ఎకరాల పంట నీటి ముంపునకు గురై ంది.


ప్రతీ ఏడాది కాస్త ముందస్తుగా పంట గట్టెక్కేది. ఈ ఏడాది కూడా రైతాంగం అదే ఆలోచనతో ముందస్తు సాగుకు దిగారు. అయితే ఈ ఏడాది మాత్రం ఆ ఆలోచన ఫలించ లేదు.కాస్త ముందస్తుగా వరుణుడు ప్రతాపం చూపించ డంతో పంట నీట మునిగింది. నష్టాలను మిగిల్చి ంది. తాడేపల్లిగూడెం మండలంలో 4 వేల ఎకరాలు, నిడదవోలు మండలంలో 3500 ఎకరాల్లో పంట నష్టపోయి నట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.


తాడేపల్లిగూడెం మండలంలోని జగన్నాఽథపురం, మాధవరం, మారంపల్లి, నందమూరు, అప్పారావుపేట తదితర గ్రామా ల్లో వరి పంట వారం రోజుల్లో కోతకు వస్తుందనగా వర్షార్ప ణం అయింది. దీంతో రైతులు తాము ఎకరానికి రూ. 20 వేల వరకూ నష్టపోయామని లబోదిబో మంటున్నారు. ప్రతీ ఏటా వర్షాలకు ఇదే తంతు అయినా ఎర్రకాలువ గట్టు పటిష్ట చర్యలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ పంట దెబ్బతిందని రైతులు వాపోతు న్నారు.  యనమదుర్రు డ్రెయిన్‌ ఉధృతికి అత్తిలి, గణపవ రం తదితర మండలాల్లో పంటకు నష్టం వాటిల్లింది.

Updated Date - 2020-09-28T11:55:59+05:30 IST