బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ఆధిక్యం

ABN , First Publish Date - 2022-04-16T14:55:28+05:30 IST

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బల్లిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ఆధిక్యంలో ఉన్నారు.....

బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ఆధిక్యం

బల్లిగంజ్(పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో బల్లిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థి బాబుల్ సుప్రియో ఆధిక్యంలో ఉన్నారు.దీంతో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సాహంలో ఉన్నారు. శనివారం బెంగాల్‌లోని అసన్‌సోల్‌లోని ఒక లోక్‌సభ స్థానం, బెంగాల్‌లోని బల్లిగంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్, బీహార్‌లోని బోచాహన్, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల ఫలితాలు  వెలువడనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. అసన్ సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి టీఎంసీ అభ్యర్థిగా శత్రుఘ్న సిన్హా పోటీ చేశారు. బీహార్ రాష్ట్రంలోని బొచాహన్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. టీఎంసీ ఎంపీ అభ్యర్థి శత్రుఘ్న సిన్హా కూడా తన ప్రత్యర్థిపై 6,500 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.


Updated Date - 2022-04-16T14:55:28+05:30 IST