Abn logo
Jul 29 2021 @ 12:59PM

రూ.50కే లీటర్ పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చు: కోదండరాం

హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గిస్తే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయని అన్నారు. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు నిర్ణయం కావడం లేదని తెలిపారు. క్రూడాయిల్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని మండిపడ్డారు. ప్రభుత్వాలు చెబుతున్న అబద్దాలను నమ్మడానికి సిద్ధంగా లేమన్నారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 50 రూపాయలకే లీటర్ పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని చెప్పుకొచ్చారు. పల్లె పల్లెకి తిరిగి ప్రజలకు ధరల పెరుగుదలపై వాస్తవాలు వివరిస్తామని కోదండరాం తెలిపారు.