Tirumala: ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను నిర్ణయించిన టీటీడీ

ABN , First Publish Date - 2021-12-18T17:22:06+05:30 IST

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.

Tirumala: ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను నిర్ణయించిన టీటీడీ

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ  నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ రూ.కోటి కాగా శుక్రవారం రోజున రూ.1.5కోట్లుగా నిర్ణయించింది. టీటీడీ దగ్గర  531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందనున్నారు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే  సౌలభ్యాన్ని కల్పించనున్నారు. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు రూ.600కోట్ల ఆదాయం రానుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. 

Updated Date - 2021-12-18T17:22:06+05:30 IST