తిరుమల: అలిపిరి నడకమార్గంలోని గాలిగోపురం వద్ద భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవారి దర్శనార్ధం నడక మార్గం గుండా వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన భక్తుడు హైదరాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్ధి రాహుల్‌గా విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. మృతిదేహాన్ని శవపరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు. శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాహుల్ విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.