Abn logo
Jan 14 2021 @ 08:24AM

తిరుమలలో భక్తుల రద్దీ.. రేపట్నుంచి సుప్రభాత సేవ

తిరుమల : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి పండుగ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు వస్తున్నారు. బుధవారం నాడు 34,768 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 13,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం రూ. 2.63 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.


ఇదిలా ఉంటే.. వెంకన్న సన్నిధిలో నేటితో ధనుర్మాస పూజలు ముగియనున్నాయి. ధనుర్మాసం ఇవాళ ముగియనుండడంతో శుక్రవారం నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతసేవ పునఃప్రారంభం కానుంది. రేపు ఉదయం గోదాదేవి పరిణయోత్సవాలు, పార్వేతి ఉత్సవం జరగనుంది. మధ్యాహ్నం మధ్యాహ్నం పార్వేటి ఉత్సవం నిర్వహించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల డిసెంబరు16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం నిర్వహిస్తూ వస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement