వెంట్రుకలు పెరగడానికి ఇంట్లోనే ఇలా చేసి చూడండి..

ABN , First Publish Date - 2021-12-02T17:19:28+05:30 IST

వెంట్రుకలు పెరగడానికి ఖరీదైన సీరం వాడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే పోషకభరిత శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే....

వెంట్రుకలు పెరగడానికి ఇంట్లోనే ఇలా చేసి చూడండి..

ఆంధ్రజ్యోతి(02-12-2021)

వెంట్రుకలు పెరగడానికి ఖరీదైన సీరం వాడవలసిన అవసరం లేదు. తక్కువ ఖర్చులోనే పోషకభరిత శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే....

వీటిని సిద్ధం చేసుకోవాలి

ఆముదం - పావు కప్పు

కొబ్బరినూనె - పావు కప్పు

మెంతులు - ఒక టేబుల్‌స్పూను

నల్ల జీలకర్ర - ఒక టేబుల్‌స్పూను

రోజ్‌మేరీ ఆయిల్‌ - రెండు చుక్కలు

పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ - రెండు చుక్కలు

తయారీ ఇలా: నల్ల జీలకర్ర, మెంతులను కొబ్బరినూనెలో వేసి, చిన్న మంట మీద 15 నిమిషాల పాటు మరిగించాలి. 

ఈ నూనెను వడగట్టి, ఆముదం కలపాలి. 

రోజ్‌మేరీ, పెప్పర్‌మింట్‌ నూనెలను కూడా జోడించాలి.

ఈ నూనెతో 10 నిమిషాల పాటు కుదుళ్లను సున్నితంగా మర్దన చేయాలి.

అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. 

ఇలా వారానికోసారి చేస్తూ ఉంటే, జుట్టు రాలడం తగ్గి, వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

Updated Date - 2021-12-02T17:19:28+05:30 IST