Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేసవిలో పాటించాల్సినవి!

ఆంధ్రజ్యోతి(03-04-2021)

రోజు రోజుకు ఎండలు ఎక్కువవుతున్నాయి. వాతావరణంలో తేమ పెరగడం కూడా చర్మం, కురుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వేసవికి తగ్గట్టుగా స్కిన్‌కేర్‌లో మార్పులు చేసుకోవాలి. వేడి నుంచి రక్షణ కోసం వైద్య నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివి...


తేలికైన క్లీన్సర్‌తో చర్మాన్ని రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. 


దుస్తులు వేసుకొనే ముందు చర్మం తడిగా లేకుండా చూసుకోవాలి. డస్టింగ్‌ పౌడర్‌ చల్లుకుంటే అది మిగిలిపోయిన తేమను పీల్చుకుంటుంది. దాంతో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల సమస్య ఉండదు. 


ఎండలో బయటకు వెళ్లేముందు సన్‌స్ర్కీన్‌ తప్పనిసరిగా రాసుకోవాలి. ముఖానికి మాస్క్‌ పెట్టుకున్న చోట సన్‌స్ర్కీన్‌ రాసుకోకున్నా పర్లేదు. 


గాలి దూరని షూ, చెప్పులను ఎక్కువ సమయం వేసుకుంటే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందుచేత పాదాల మీద డస్టింగ్‌ పౌడర్‌ చల్లుకున్న తరువాతే సాక్సులు, షూ వేసుకోవాలి. 


ఈ జాగ్రత్తలతో పాటు వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరిస్తే వేసవిలో రక్షణ లభిస్తుంది.


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...