పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని నియమాలు పాటించాల్సిందే!

ABN , First Publish Date - 2022-03-12T18:17:46+05:30 IST

ఖాళీగా ఉంది కదా! అని జానెడు పొట్టలో ఏదో ఆహారాన్ని పోస్తే అది బోలెడు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పొట్టంటే ఆరోగ్యకేంద్రం. అలా కాకుండా కొందరు వీలైనంత ఆహారాన్ని వేసుకునే బిన్‌లా చూస్తారు. అయితే జీర్ణవ్యవస్థ సాఫీగా జరిగి.. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని నియమాలు పాటించాల్సిందే.

పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని నియమాలు పాటించాల్సిందే!

ఆంధ్రజ్యోతి(12-03-2022)

ఖాళీగా ఉంది కదా! అని జానెడు పొట్టలో ఏదో ఆహారాన్ని పోస్తే అది బోలెడు సమస్యల్ని తెచ్చిపెడుతుంది. పొట్టంటే ఆరోగ్యకేంద్రం. అలా కాకుండా కొందరు వీలైనంత ఆహారాన్ని వేసుకునే బిన్‌లా చూస్తారు. అయితే జీర్ణవ్యవస్థ సాఫీగా జరిగి.. పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని నియమాలు పాటించాల్సిందే.

ఎక్కువ ఆహారం తీసుకుంటే జీర్ణం కావటానికి సమయం పడతుంది. దీనివల్లనే పొట్టలో వికారం, వాంతి వచ్చినట్లు ఉంటుంది. పెద్ద పేగులో ఆహారం ఉన్నంత సేపు.. గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. ఏదేమైనా.. వేపుళ్లు, మసాలాలు తగ్గిస్తే పొట్టకు మంచిది. పెద్ద పేగుల్లో మలం బయటకి పోనప్పుడు మలబద్ధకం వస్తుంది. ఈ సమస్య ఒత్తిడి, ఆహారం అలవాట్లు, హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల కలుగుతుంది. పొట్ట పాడవకుండా ఉండాలంటే.. పీచు పదార్థం బాగా తింటే.. జీర్ణం సులువు అవుతుంది. చిన్న పేగుల్లో అల్సర్‌ ఉంటే.. ఏది తిన్నా మంట కలుగుతుంది. దీనికోసం ఏదో ఒకటి తినటం, నీళ్లు తాగడం చేస్తారు. ఒక్కోసారి పేగుల్లోని బొబ్బలు పగిలి మలంలో రక్తం కూడా వస్తుంది. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే అతిగా తినకూడదు. సీజనల్‌ ఫ్రూట్స్‌ తింటుండాలి. నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఇష్టమొచ్చిన సమయంలో భోజనం చేస్తే కడుపులో మంట, గ్యాస్‌ కచ్చితంగా వస్తుంది.ఏ ఆహరం తిన్నా నమిలి మింగి తినాలి. ఉదయం నిద్రలేస్తూనే వీలైనన్ని మంచి నీళ్లు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకుండా.. కాసేపు నడవాలి. వ్యాయామాలు లేదా యోగా చేస్తే పొట్టకు మంచిది. పొట్ట ఆరోగ్యంకోసం ప్రత్యేక ఆసనాలుంటాయి. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్‌, మద్యపానం, ధూమపానంకు దూరంగా ఉంటే.. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. ఏ సమస్య అయినా పొట్టలోనే మొదలవుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో క్రమశిక్షణ ఉండాలి.

Updated Date - 2022-03-12T18:17:46+05:30 IST