చర్మం నిగారింపు కోసం...

ABN , First Publish Date - 2020-06-20T05:30:00+05:30 IST

ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా మారినప్పుడు బాదం, గసగసాలు, కుంకుమపువ్వు, పాలతో తయారు చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడుక్కుంటే మృతకణాలు వదిలి ముఖం తాజాదనంతో...

చర్మం నిగారింపు కోసం...

  1. ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా మారినప్పుడు బాదం, గసగసాలు, కుంకుమపువ్వు, పాలతో తయారు చేసుకున్న ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తరువాత నీళ్లతో కడుక్కుంటే మృతకణాలు వదిలి ముఖం తాజాదనంతో మెరుస్తుంది. బాదం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గసగసాలు స్క్రబ్బర్‌లా పనిచేస్తాయి. పాలు చర్మానికి పోషణనిస్తాయి. కుంకుమపువ్వు ముఖానికి కాంతినిస్తుంది. 
  2. ముఖం మీది చర్మం పొడిగా మారినప్పుడు నెయ్యి రాసుకోవాలి. తరువాత క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. చర్మం జిడ్డుగా ఉంటే ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది.
  3. రోజంతా టీవీ, స్మార్ట్‌ఫోన్‌ చూడడం వల్ల కళ్లు తొందరగా అలసిపోతాయి. అప్పుడు కీరదోస ముక్కలు, యోగర్ట్‌ను పేస్ట్‌లా చేసుకోవాలి. కళ్ల మీద ఈ పేస్ట్‌ను రాసుకొని 10 నిమిషాలయ్యాక నీళ్ళతో కడుక్కోవాలి. దీంతో కళ్ల అలసటతో పాటు కళ్ల కింది వలయాలు తగ్గిపోతాయి. 
  4. చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలున్న వారు గుడ్డు, యోగర్ట్‌ మిశ్రమాన్ని తలకు మాస్క్‌లా వేసుకోవాలి.

Updated Date - 2020-06-20T05:30:00+05:30 IST