టిక్ టాక్ రేటింగ్ మళ్లీ పెరిగింది...

ABN , First Publish Date - 2020-05-29T22:35:27+05:30 IST

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం టిక్ టాక్ యాప్ రేటింగ్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రేటింగ్స్ మళ్లీ పెరిగాయి. గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ రేటింగ్స్ మళ్లీ పెరిగాయి. గతవారం 1.2 స్టార్స్‌గా ఉన్న రేటింగ్ ఇప్పుడు 4.4 కు పెరిగింది. అయితే భారత్‌లో టిక్ టాక్ పై వ్యతిరేకత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే గూగుల్ మాత్రం తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ లక్షల్లో వన్ స్టార్ రేటింగ్స్2ను తొలగించింది.

టిక్ టాక్ రేటింగ్ మళ్లీ పెరిగింది...

ముంబై : ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం టిక్ టాక్ యాప్ రేటింగ్స్ పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రేటింగ్స్ మళ్లీ పెరిగాయి. గూగుల్ ప్లే స్టోర్ లో టిక్ టాక్ యాప్ రేటింగ్స్ మళ్లీ పెరిగాయి. గతవారం 1.2 స్టార్స్‌గా ఉన్న రేటింగ్ ఇప్పుడు 4.4 కు పెరిగింది. అయితే భారత్‌లో టిక్ టాక్ పై వ్యతిరేకత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. అయితే గూగుల్ మాత్రం తమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ లక్షల్లో వన్ స్టార్ రేటింగ్స్2ను తొలగించింది. 


టిక్ టాక్ పేరును ప్రస్తావించకుండా గూగుల్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించారు. అసంబద్ధమైన రేటింగ్స్, కామెంట్స్ ను తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్లేస్టోర్ రేటింగ్స్ వినియోగదారులు ఆ యాప్, అందులో ఉన్న కంటెంట్ గురించి తెలుసుకునేలా ఉంటాయని తెలిపారు.


కేవలం ఒక్కవారంలోనే 80 లక్షల రేటింగ్స్ ను గూగుల్ తొలగించింది. గతవారం గూగుల్ ప్లేస్టోర్ లో టిక్ టాక్ కు వన్ స్టార్ రేటింగులు పోటెత్తాయి. అయితే వీటిలో చాలా రేటింగులు ప్రస్తుతం అందుబాటులో లేవు. గూగుల్ గైడ్ లైన్స్ ప్రకారం వినియోగదారులు యాప్ రేటింగ్స్ ను ప్రభావితం చేయకూడదు. దీన్ని కారణంగా చూపిస్తూ ఎన్నో 1 స్టార్ రేటింగులను ప్లేస్టోర్ తొలగించింది.


Updated Date - 2020-05-29T22:35:27+05:30 IST