అటువంటి ఆలోచన లేదు.. టిక్‌టాక్ క్లారిటీ..

ABN , First Publish Date - 2020-07-03T04:25:52+05:30 IST

చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌లో...

అటువంటి ఆలోచన లేదు.. టిక్‌టాక్ క్లారిటీ..

బీజింగ్: చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ నిషేధం విధించిన 59 చైనా యాప్స్‌లో ఒకటైన టిక్‌టాక్.. నిషేధంపై కీలక ప్రకటన చేసింది. భారత ప్రభుత్వం తమ యాప్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై న్యాయపరంగా వెళ్లాలనే ఆలోచన ఏమీ లేదని టిక్‌టాక్ యాజమాన్యం గురువారం స్పష్టం చేసింది.


భారత ప్రభుత్వ చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని.. అయితే.. తమ యూజర్ల వ్యక్తిగత భద్రతకే తమ తొలి ప్రాధాన్యం ఉంటుందని టిక్‌టాక్ ప్రకటించింది. డేటా భద్రతకు ఎటువంటి భంగం కలగనివ్వలేదని, భవిష్యత్‌లో కూడా అలాంటి పరిస్థితి ఎదురుకాదని టిక్‌టాక్ చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-07-03T04:25:52+05:30 IST