అలాస్కా సముద్ర తీరంలో సునామీ హెచ్చరిక

ABN , First Publish Date - 2020-10-20T10:47:23+05:30 IST

అలాస్కా తీరంలోని సముద్రం అంతర్భాగంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ లేదా భారీ పోటు అలలు సంభవించే ప్రమాదముందని...

అలాస్కా సముద్ర తీరంలో సునామీ హెచ్చరిక

అలస్కా(అమెరికా): అలాస్కా తీరంలోని సముద్రం అంతర్భాగంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ లేదా భారీ పోటు అలలు సంభవించే ప్రమాదముందని యునైటెడ్ స్టేట్సు సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అలాస్కా సముద్ర నైరుతి తీరంలో సముద్రం కింద భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం వల్ల సునామీ లేదా భారీ పోటు  అలలు సంభవించే అవకాశముందని అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. 


అలాస్కాలోని శాండ్ పాయింటుకు ఆగ్నేయంగా 55 మైళ్ల దూరంలో సోమవారం సాయంత్రం 4.54 గంటలకు 7 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. సముద్ర గర్భంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సునామీ లేదా సముద్రంలో భారీ అలలు ఎగసిపడే ప్రమాదముందని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం వివరించింది. అలాస్కా సముద్ర తీరంలో అమెరికా అలర్ట్ ప్రకటించింది. 

Updated Date - 2020-10-20T10:47:23+05:30 IST