Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొద్దిపాటి తేడాలొచ్చిన బరువు పెరుగుతారు..

ఆంధ్రజ్యోతి(05-07-2020)

ప్రశ్న: నాకు ముప్పై ఐదేళ్లు. థైరాయిడ్‌ సమస్య ఉంది. గుండె దడ, ఆందోళన కూడా ఎక్కువే. ఏ ఆహార నియమాలు పాటించాలి?


- షమీమ్‌, ఖమ్మం 


డాక్టర్ సమాధానం: థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు ఆహారంలో కొద్దిపాటి తేడాలొచ్చినా త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. బ్రౌన్‌ రైస్‌, గోధుమ రొట్టెలు, అప్పుడప్పుడూ చిరుధాన్యాలను తీసుకోవచ్చు. అయితే అధిక భాగం ఆకు కూరలు, కూరగాయలు, పళ్ళు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, గుడ్లు మంచివే. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ముల్లంగి లాంటివి తగ్గించాలి. గుండె దడకు పలు కారణాలు ఉండవచ్చు. అధిక ఆందోళన, కాఫీ, టీలు ఎక్కువ తీసుకోవడం, నిద్ర లేమి, రక్తహీనత లేదా గుండెకు సంబంధించిన సమస్యల వల్ల గుండె దడ రావచ్చు. ఇది తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిన విషయం. వయసుతో సంబంధం లేకుండా ఆందోళన అందరికీ సర్వసాధారణం అయింది. ఆందోళన తగ్గించేందుకు వ్యాయామం, తగిన నిద్ర వేళలు, యోగా, ధ్యానం చేయాలి. ఆవశ్యక ఫాటీ ఆమ్లాలైన ఇపిఎ, డిహెచ్‌ఎలు ఆందోళన తగ్గడానికి అవసరమైన సెరోటోనిన్‌, డోపమైన్‌ అనే న్యూరో ట్రాన్స్మిటర్స్‌ను నియంత్రిస్తాయి. ఈ ఆమ్లాలు సాల్మన్‌ చేప, మాకరెల్‌ చేప, ఆయిస్టర్స్‌, సముద్రపు రొయ్యలు మొదలైన వాటిలో లభిస్తాయి. వీటిని సప్లిమెంట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...