Abn logo
Nov 25 2020 @ 21:46PM

కరోనా సెకండ్ వేవ్...3వేల వివాహాలు

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు 3వేల వివాహాలు చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత 24 గంటల్లో జైపూర్ నగరంలో 656 కరోనా కేసులు వెలుగుచూడటంతో రాత్రివేళ్ల కర్ఫ్యూ విధించారు. ఒకవైపు కరోనా పెరుగుతుండగా, మరో వైపు జైపూర్ లో 3వేల వివాహాలు జరగనున్నాయట. దేవ్ ఉతాని ఏకాదశి సందర్భంగా మంచి ముహూర్తం ఉండటంతో వధూవరులు వివాహాలు చేసుకునేందుకు సంసిద్ధమయ్యారు. జైపూర్ నగరంలో వివాహ సామాగ్రి కొనేందుకు దుకాణాల వద్ద జనం రద్దీ పెరిగింది.కరోనా ప్రబలుతున్నా మంచి ముహూర్తం ఉండటంతో తక్కువ మంది అతిథులతో వివాహం చేసుకునేందుకు వధూవరులు సమాయత్తమయ్యారు. మహమ్మారి సమయంలో వివాహానికి అతిథుల సంఖ్య 100 కి పరిమితం చేశారు.వివాహ ఊరేగింపులకు అనుమతి ఇవ్వడం లేదని జైపూర్ అదనపు జిల్లా కలెక్టరు ఇక్బాల్ చెప్పారు. 

Advertisement
Advertisement