collapses: గురుగ్రామ్‌లో ఒకరి మృతి..శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు

ABN , First Publish Date - 2021-07-19T13:02:46+05:30 IST

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలిన ఘటనలో...

collapses: గురుగ్రామ్‌లో ఒకరి మృతి..శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నారు

గురుగ్రామ్ (హర్యానా): హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఓ భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మరణించగా, మరో ఆరుగురు శిథిలాల్లో చిక్కుకున్నారు. గురుగ్రామ్ జిల్లా ఖవాస్ పూర్ గ్రామంలో ఆదివారం రాత్రి మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసు,అగ్నిమాపకశాఖ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల తొలగింపు ప్రారంభించారు. సంఘటన స్థలంలో శిథిలాల కింద చిక్కుకున్న వారికి చికిత్స అందించేందుకు అంబులెన్సుతోపాటు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.మరో 20 గంటల పాటు శిథిలాల తొలగింపు పనులు చేస్తామని గురుగ్రామ్ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ చెప్పారు. వేర్ హౌస్ కంపెనీ భవనం నిర్మిస్తుండగా ఈ ఘటన జరిగిందని, శిథిలాల కింద ఆరుగురు కార్మికులున్నారని భావిస్తున్నామని పోలీసు డిప్యూటీ కమిషనర్ వరుణ్ సింగ్లా చెప్పారు. నిర్మాణ లోపంతోపాటు భారీవర్షాల వల్ల ఈ భవనం కుప్పకూలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 


Updated Date - 2021-07-19T13:02:46+05:30 IST