మూడు విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2020-07-03T10:14:47+05:30 IST

మధురపూడి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్‌కు రెండు, బెంగళూరుకు ఒకటి సర్వీసులను నడుపుతోంది.

మూడు విమాన సర్వీసులు

కోరుకొండ, జులై 2: మధురపూడి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానయాన సంస్థ హైదరాబాద్‌కు రెండు, బెంగళూరుకు ఒకటి సర్వీసులను నడుపుతోంది. ప్రతీరోజూ ఉదయం హైదరాబాద్‌ నుంచి 9.20 గంట లకు వచ్చే విమానం 9.50కి తిరిగి బయల్దేరుతుంది. రెండో సర్వీసు బెంగళూరు నుంచి సాయంత్రం 5.30కు వచ్చి తిరిగి ఆరు గంటలకు వెళ్తుంది. మూడవ సర్వీసు రాత్రి 8.50కి హైదరాబాద్‌ నుంచి వచ్చి 9.15కు ఇక్కడి నుంచి బయల్దేరుతుంది. దీంతో ప్రయాణికుల సంఖ్య  క్రమక్రమంగా పెరుగుతోంది.

Updated Date - 2020-07-03T10:14:47+05:30 IST