Abn logo
Sep 29 2020 @ 06:03AM

వడోదరలో భవనం కూలి ముగ్గురి దుర్మరణం

Kaakateeya

వడోదర (గుజరాత్): నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఆకస్మాత్తుగా కుప్పకూలడంతో ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో సోమవారం రాత్రి జరిగింది. వడోదర నగరంలోని బావామాన్ పురా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవార అర్దరాత్రి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. స్థానిక ప్రజలు, అధికారులు సంఘటన స్థలానికి వచ్చి శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించనందువల్లే భవనం కూలిందని భావిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement