కేరళలో ‘డెల్టా ప్లస్’ కలకలం... రెండు జిల్లాల్లో గుర్తించిన అధికారులు..

ABN , First Publish Date - 2021-06-22T05:17:28+05:30 IST

కేరళలో ‘డెల్టా ప్లస్’ కలకలం... మూడు కేసులు గుర్తించిన అధికారులు..

కేరళలో ‘డెల్టా ప్లస్’ కలకలం...  రెండు జిల్లాల్లో గుర్తించిన అధికారులు..

పతనంతిట్ట: కేరళలో కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు కలకలం రేపాయి. పాలక్కాడ్, పతనంతిట్ట జిల్లాల్లో సేకరించిన నమూనాల్లో ముగ్గురు వ్యక్తులకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు గుర్తించామని ఇవాళ అధికారులు వెల్లడించారు. పతనంతిట్టి జిల్లాలోని కడాప్రా పంచాయితీలో నాలుగేళ్ల ఓ బాలుడికి కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని కలెక్టర్ డాక్టర్ ఎన్‌టీఎల్ రెడ్డి వెల్లడించారు. సీఎస్ఐఆర్- ఐజీఐబీలో బాలుడి నమూనాలపై జెనెటిక్ స్టడీ చేసిన తర్వాత అతడు కొత్త వేరియంట్ బారిన పడినట్టు తేలిందని కలెక్టర్ తెలిపారు. కొత్త వేరియంట్ వెలుగుచూసిన నేపథ్యంలో దీని వ్యాప్తిని అరికట్టేందుకు రెండు జిల్లాల అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-06-22T05:17:28+05:30 IST