కడప: TDP రాష్ట్ర కార్యదర్శి సాయినాధ్ శర్మను గుర్తు తెలియని వ్యక్తులు పరోక్షంగా బెదిరించారు. కమలాపురంలో ఆయన కారును ధ్వంసం చేశారు. ఆయన ఇంటిగోడల మీద, గేట్లకు కరపత్రాలు అంటించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని, లేదంటే కారుకు పట్టిన గతే నీకు పడుతుందని కరపత్రాల మీద రాసి ఉంది. రేపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమలాపురంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సాయినాధ్ శర్మ ఇంటి గోడలపై బెదిరింపు కరపత్రాలు కనిపించాయి.
ఇవి కూడా చదవండి