ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారుల డిమాండ్

ABN , First Publish Date - 2020-09-27T23:41:36+05:30 IST

ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారుల డిమాండ్

ఇజ్రాయెల్ ప్రధాని రాజీనామా చేయాలంటూ నిరసనకారుల డిమాండ్

జెరూసలెం: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇజ్రాయెల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజూకూ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో రెండోసారి లాక్‌డౌన్ విధించింది. దేశవ్యాప్తంగా ‌లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వేలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. జెరూసలెంలోని పీఎం బెంజమిన్ నెతన్యాహు అధికారిక నివాసం వెలుపల వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అవినీతి కేసులపై నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసనలు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరిగాయి.

Updated Date - 2020-09-27T23:41:36+05:30 IST