టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN , First Publish Date - 2021-10-22T06:31:31+05:30 IST

టీడీపీ నేతలపై, కేంద్ర కార్యాలయంపై దాడులు చేసిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు.

టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలి
కనిగిరిలో నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు

సంఘీభావ దీక్షలో ఆ పార్టీ నేతలు

కనిగిరి, అక్టోబరు 21: టీడీపీ నేతలపై, కేంద్ర కార్యాలయంపై దాడులు చేసిన వైసీపీ గూండాలను కఠినంగా శిక్షించాలని టీడీపీ నగర పంచాయతీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులరెడ్డి డిమాండ్‌ చేశారు. అమరావతిలో టీడీపీపై వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు మద్దతుగా గురువారం కనిగిరి టీడీపీ కార్యాల యంలో సంఘీభావ దీక్ష చేశారు. టీడీపీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు నల్లరిబ్బన్లు ధరించి సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న టీడీపీకి దేవాలయం లాంటి కార్యాలయంపై వైసీపీ పేటీఎం బ్యాచ్‌ దాడులు చేయడం అప్రజాస్వామ్యకమని  అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దొంగతనం చేసిన వాడే ‘దొంగా.. దొంగా’ అన్నట్లుగా ఉందని ఎద్దేవ చేశాడు. ఇలాంటి నీచ సంస్కృతి కేవలం వైసీపీ నేతలకు, పార్టీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శ్రీనివాసులరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ అహ్మద్‌, రోషన్‌ సందాని, చింతలపూడి తిరుపాలు, గుడిపాటి ఖాదర్‌, కాసుల శ్రీరాములు, ఉమర్‌ ఫారూక్‌, కరాటే యాసిన్‌, అప్రోజ్‌, గౌస్‌, షడ్రక్‌, పెన్నా వెంకటేశ్వర్లు, కొండలు, రామసుబ్బారెడ్డి, జిలాని, చిలకపాటి లక్ష్మయ్య, బ్రహ్మం, చిన్నరామిరెడ్డి, ఇస్మాయిల్‌, రిజ్వాన్‌, బొగ్గరపు రాజా, నాగూర్‌, షాకిర్‌, అజాం, రహిమాన్‌, రమణయ్య, ఇలియాజ్‌, రసూల్‌, బడేబాయి, సుతారి కోటి తదితరులు పాల్గొన్నారు. 

అదేవిధంగా చంద్రబాబు దీక్షలో పాల్గొనేందుకు కనిగిరి నుంచి తమ్మినేని వెంకటరెడ్డి, భేరి పుల్లారెడ్డి, గాయం తిరుపితిరెడ్డి, ముచ్చుమూరి చెంచిరెడ్డి, కొండా కృష్ణారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యాలనికి వెళ్లారు. 

పామూరు : అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అనే అంశంపై 36 గంటల పాటు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావంగా మండల టీడీపీ ఆద్వర్యంలో పామూరు నుండి ప్రత్యేక వాహనాల్లో  గురువారం అమరావతికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు. తరలివెళ్లిన వారిలో  టీడీపీ మండల అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ బొల్లా మాల్యాద్రిచౌదరి, వైఎస్‌ ప్రసాద్‌రెడ్డి, ఎం.హుస్సేన్‌రావు యాదవ్‌, ఏ.ప్రభాకర్‌ చౌదరి, షేక్‌ ఖాజారహంతుల్లా, గౌస్‌బాష, పాలపర్తి వెంకటేశ్వర్లు, మన్నం రమణయ్య, ఎన్‌ సాంబయ్య, పి సత్యం, డోలా శేషాద్రి, ఇర్రి.కోటిరెడ్డి, శివశంకర్‌, గుత్తి మహేష్‌, చావా సుబ్బారావు, గుంటుపల్లి శ్రీనివాసులు, ఏ హరిప్రసాద్‌, ఆర్‌ఆర్‌ రఫీ, కౌలూరి హనీప్‌, మస్తాన్‌, శేషం మోసే, టి చంద్ర తదితరులు ఉన్నారు. 

కందుకూరు : ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల దీక్షకు కందుకూరు నియోజకవర్గ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీఎమ్మెల్యే దివి శివరాంతో పాటు ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కంచర్ల శ్రీకాంత్‌ చౌదరి, నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, పార్టీ కమిటీలలోని బాధ్యులు, ముఖ్యనాయకులు మంగళగిరి చేరుకుని చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు వేముల గోపాలరావు, దామా మల్లేశ్వరరావు, జనిగర్ల నాగరాజు, నార్నె రోశయ్య, మాదాల లక్ష్మీనరసింహ్మం, రాచగర్ల సుబ్బారావు, ఎన్‌వి సుబ్బారావు, బొల్లినేని నాగేశ్వరరావు, రెబ్బవరపు మాల్యాద్రి, షేక్‌ రఫి, బెజవాడ ప్రసాదు, పొడపాటి మహేష్‌, చిలకపాటి మధు, రాయపాటి శ్రీనివాసరావు తదితరులున్నారు. 

ఉలవపాడు, అక్టోబరు 21 : వైసీపీ రౌడీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై సృష్టించిన ధమనకాండకు టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన నిరివధిక నిరసన దీక్షకు మండలం నుంచి తెలుగు తమ్ముళ్లు కదిలి వెళ్లారు. ఉలవపాడు, కరేడు, చాకిచర్ల, చాగొల్లు, ఇతర గ్రామాల నుంచి సొంత వాహనాలలో వెళ్లి సంఘీభావం తెలిపారు.

సీఎ్‌సపురం : రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై దాడుల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న దీక్షలో  టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. తాడేపల్లిలోని టీడీపీ కార్యాలయంలో చేపడుతున్న దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌  పునుగుపాటి రవికుమార్‌, కె.వెంకటస్వామి, నాగరాజు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T06:31:31+05:30 IST