కుక్కునూరు, ఫిబ్రవరి 23 : మండల పరిధిలోని తొండిపాక పంచాయతీలో బంజరగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌లు బయట పడిన విషయం విదితమే. అయితే ఓటు వేసిన బ్యాలెట్ పేపర్‌లు రెండు తొండిపాక పంచాయతీలోని బంజరగూడెంలోని 6వ పోలింగ్ బూత్‌లోనివిగా గుర్తించినట్టు మంగళవారం ఎంపీడీవో లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ బూత్‌లో 134 ఓట్లు పడగా కౌంటింగ్ సమయంలో 133 మాత్రమే వచ్చినట్టు గుర్తించామన్నారు. అయితే కావాలని ఒక వ్యక్తి వార్డు, సర్పంచ్‌కు ఓటు వేసి బ్యాలెట్ పేపర్లు బయటకు తెచ్చినట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశామని ఎంపీడీవో వివరించారు.