కుంభమేళా భక్తులు కరోనాను ప్రసాదంగా తీసుకొస్తున్నారు : ముంబై మేయర్

ABN , First Publish Date - 2021-04-17T19:43:19+05:30 IST

కుంభమేళా నుంచి తమ తమ జిల్లాలకు తిరిగి వచ్చే భక్తులు కరోనాను ‘ప్రసాదం’ లా పంచుతారని ముంబై మేయర్ కిశోరీ

కుంభమేళా భక్తులు కరోనాను ప్రసాదంగా తీసుకొస్తున్నారు : ముంబై మేయర్

ముంబై : కుంభమేళా నుంచి తమ తమ జిల్లాలకు తిరిగి వచ్చే భక్తులు కరోనాను ‘ప్రసాదం’ లా పంచుతారని ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ వ్యాఖ్యానించారు. కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారందరూ విధిగా హోం క్వారెంటైన్ కావాలని విజ్ఞప్తి చేశారు. ముంబైలో కూడా కుంభమేళా నుంచి తిరిగొచ్చిన వారందర్నీ క్వారంటైన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 95 శాతం మంది ముంబై ప్రజలు కోవిడ్ రూల్స్‌ను విధిగా పాటిస్తున్నారని, మిగితా 5 శాతం మందితోనే ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తేనే బాగుంటుందని కిశోర్ పెడ్నేకర్ నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-04-17T19:43:19+05:30 IST