చేపలు తినేందుకు నిరాకరిస్తున్న Penguins.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

ABN , First Publish Date - 2022-07-09T23:07:00+05:30 IST

ప్రపంచ దేశాలను మరోసారి ఆర్థిక మాంద్యం సమస్య వెంటాడుతోంది. దీంతో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం జపాన్‌పై కూడా ఉండటంతో అక్కడ..

చేపలు తినేందుకు నిరాకరిస్తున్న Penguins.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

ప్రపంచ దేశాలను మరోసారి ఆర్థిక మాంద్యం సమస్య వెంటాడుతోంది. దీంతో నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం జపాన్‌పై కూడా ఉండటంతో అక్కడ చేపలతో పాటూ ఇతర ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో హకోనే-ఎన్ జూ, అక్వేరియమ్ నిర్వాహకులు ఖర్చులు తగ్గించేందుకు మెనూలో మార్పులు చేశారు. పెంగ్విన్స్, ఓట్టర్స్‌‌కు తక్కువ ధరలో దొరికే చేపలు ఆహారంగా అందిస్తున్నారు. అయితే, ఈ తక్కువ రేటు చేపలను తినేందుకు పెంగ్విన్లు నిరాకరిస్తున్నాయి.


అంతకుముందు వీటికి జపనీస్ హార్స్ మ్యాకెరెల్ అనే చేపల్ని ఆహారంగా ఇచ్చేవారట.. ఇటీవలి కాలంలో ఈ చేపల ధరలు భారీగా పెరిగాయి. దీంతో వీటిని కొనలేని నిర్వాహకులు తక్కువ ధరలో దొరికే సాబా అనే మరో రకం చేపల్ని ఆహారంగా అందిస్తున్నారు. జపాన్‌లో చాలా జూ నిర్వాహకుల పరిస్థితి ఇలానే ఉందని నిర్వాహకులు వాపోతున్నారు.. ప్రస్తుతం పెంగ్విన్స్ చేపల్ని తినేందుకు నిరాకరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ఇలాక్కూడా ఇస్త్రీ చేస్తారా.. ఇతను బట్టలను Iron చేసే విధానం చూస్తే.. వామ్మో! అని అంటారు..



Updated Date - 2022-07-09T23:07:00+05:30 IST