Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెట్రో ధరల పెంపులో ఏపీదే ప్రథమ స్థానం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ 


చీడికాడ, డిసెంబరు 1: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపులో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌ అన్నారు.  ఖండివరంలో బుధవారం రాత్రి గౌరవసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రో ధరల పెంపుతో రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పేదలకు అందని ద్రాక్షలా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు మహిళలకు అన్ని విధాలా పెద్దపీట వేస్తామని చెప్పిన వైసీపీ నాయకులు, ఇప్పుడు మహిళలను కించపరచడం దారుణమన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఘోరంగా కించపరచి సభ్యసమాజం తలదించేలా వైసీపీ నేతలు వ్యవహరించారన్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్న మహిళలంతా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారన్నారు. అయినా వారికి జ్ఞానోదయం కలగకపోవడం విచారకరమని వాపోయారు. చంద్రబాబునాయుడు సీఎం అయ్యేవరకూ నిద్రపోమని కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కుచ్చు కళావతి, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు పి.సత్యవతి, టీడీపీ నాయకులు పోతల అప్పలనాయుడు, శీరంరెడ్డి లక్ష్మి, కసిరెడ్డి గణపతి, అమ్మతల్లినాయుడు, సింగంపల్లి శ్రీనివాస్‌, చిట్టినాయుడు, రామలింగస్వామి, కురచా నారాయణమూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement