బర్డ్‌ ఫ్లూ వ్యాధితో బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-07-21T07:53:18+05:30 IST

బర్డ్‌ ఫ్లూ వ్యాధితో 12 ఏళ్ల బాలుడు మృతి చెందినట్టు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

బర్డ్‌ ఫ్లూ వ్యాధితో బాలుడి మృతి

భారత్‌లో ఈ ఏడాది ఇదే తొలి కేసు

న్యూఢిల్లీ, జూలై 20: బర్డ్‌ ఫ్లూ వ్యాధితో 12 ఏళ్ల బాలుడు మృతి చెందినట్టు ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. దీంతో భారత్‌లో ఈ ఏడాది మనుషుల్లో బర్డ్‌ ఫ్లూ వల్ల మరణించిన తొలి కేసుగా ఇది నమోదైంది. న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో జూలై 2న ఆ బాలుడు ఎయిమ్స్‌లో చేరాడు. చికిత్స పొందుతూ అక్కడే జూలై 12వ తేదీన మరణించాడు. చికిత్స అందించే సమయంలో బాలుడికి కొవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా పరీక్షలు చేశారు. కొవిడ్‌ పరీక్షల్లో నెగిటివ్‌ రాగా, ఇన్‌ఫ్లుయెంజా పరీక్ష పాజిటివ్‌గా తేలింది. నిర్థారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంస్థకు నమూనాలను పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) పాజిటివ్‌గా తేలింది.  

Updated Date - 2021-07-21T07:53:18+05:30 IST