కేవలం 12 రూపాయలకే అద్భుతమైన ఇంటిని కొనుక్కోవచ్చు.. ఎక్కడో తెలుసా..?

ABN , First Publish Date - 2021-06-19T23:00:44+05:30 IST

ఈ రోజుల్లో పెళ్లి సులభంగానే అయిపోతోంది గానీ, ఇల్లు కట్టడమంటే మాత్రం మాటలు కాదు.

కేవలం 12 రూపాయలకే అద్భుతమైన ఇంటిని కొనుక్కోవచ్చు.. ఎక్కడో తెలుసా..?

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఈ రోజుల్లో పెళ్లి సులభంగానే అయిపోతోంది గానీ, ఇల్లు కట్టడమంటే మాత్రం మాటలు కాదు. కొన్ని లక్షలు ఖర్చుపెట్టాలి. అయితే క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ అనే పట్టణంలో ఒక ఇల్లు ఖరీదు కేవలం 12 రూపాయలు మాత్రమే. ఏంటి నమ్మశక్యంగా లేదా? నిజమే.. లెగ్రాడ్ పట్టణ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత విలాసవంతమైన ఇంటిని కేవలం 12 రూపాయలకే అమ్ముతోంది. దానికి కారణమేమిటంటే..


క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ పట్టణం కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతోంది. లెగ్రాడ్‌లోని ప్రజలు సమీపంలోని పెద్ద నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోతోంది. దీంతో మళ్లీ లెగ్రాడ్ పట్టణాన్ని ప్రజలతో కళకళలాడేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే సరికొత్త ప్లాన్‌తో ప్రజల ముందుకొచ్చింది. ఆ నగరంలోని ఇళ్లను అత్యంత చవకగా విక్రయించాలని నిర్ణయించుకుంది. ఎంత చవకగా అంటే భారత కరెన్సీలో ఒక ఇంటి విలువ కేవలం 12 రూపాయలు మాత్రమే. 


అంతేకాదు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ ఇంటి రిపేర్ కోసం ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం కూడా చేస్తుంది. అయితే అక్కడ ఇంటిని కొనే వారికి కొన్ని షరతులు విధిస్తోంది. అవేంటంటే.. అక్కడ ఇళ్లు కొనే వారు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలి. అలాగే 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే లెగ్రాడ్‌లో కనీసం 15 ఏళ్ళు నివసిస్తామని హామీ పత్రం రాసివ్వాలి. షరతులకు ఒప్పుకున్న వాళ్లకే ఇళ్లను చవకగా అమ్ముతోంది. అలా ఇప్పటివరకు 17 ఇళ్లను అమ్మినట్టు మేయర్ తెలిపారు. 

Updated Date - 2021-06-19T23:00:44+05:30 IST