రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

ABN , First Publish Date - 2021-01-27T05:26:58+05:30 IST

నగరంలో ప్రభుత్వ, పార్టీ కార్యాలయాలు, హైస్కూళ్లలో మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. ఆయా చోట్ల జెండా ఎగురవేసి వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలను వివరించారు.

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
జెండా వందనం చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి

నగరంలో పలుచోట్ల జెండావందనం 


   నగరంలో ప్రభుత్వ, పార్టీ కార్యాలయాలు, హైస్కూళ్లలో మువ్వన్నెల జెండా రెపరెప లాడింది. ఆయా చోట్ల జెండా ఎగురవేసి వందనం చేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితాలను వివరించారు. 


కడప(లీగల్‌), జనవరి 26: రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి, విలువలకు కట్టుబడి పనిచేయాలని జిల్లా ప్రధాన జడ్జి జి.పురుషోత్తం కుమార్‌ తెలిపారు. కోర్టు ప్రాంగణంలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు జడ్జికి గౌరవ వందనం చేశారు. అనంతరం ప్రధాన జడ్జి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అక్కడ నుంచి జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయవాదుల సంఘ భవన కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జి.వి.రాఘవరెడ్డి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్జిలు శ్రీనివాస్‌ శివరామ్‌, కళ్యాణ చక్రవర్తి, వెంకటరాజే్‌షకుమార్‌, క్రిష్ణకుట్టి, ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, కె.ప్రత్యూషకుమారి, రాయల్‌, పెద్ద కాశీం, పర్మనెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ విష్ణుప్రసాద్‌రెడ్డి, ఏవో ప్రసన్నకుమార్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి అరుణకుమారి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


జడ్పీ కార్యాలయంలో.... 

కడప(రూరల్‌), జనవరి 26: జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి జాతీయ నాయకులకు, రాజ్యాంగ నిర్మాతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ డిప్యూటీ సీఈవో ఆర్‌.నాగిరెడ్డి, అకౌంట్‌ ఆఫీసర్‌ రంగాచార్యులు, పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లంకా మల్లేశ్వరరెడ్డి, ఏవోలు, ఇతర ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 


వైసీపీ జిల్లా కార్యాలయంలో... 

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 26: వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపముఖ్యమంత్రి అంజద్‌బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, మాజీ మేయర్‌ సురే్‌షబాబులు జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పులి సునీల్‌కుమార్‌, సుభాన్‌బాషా, అఫ్జల్‌ఖాన్‌, షఫి, అజ్మతుల్లాతో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.


టీడీపీ కార్యాలయంలో ...

కడప, జనవరి 26 (ఆంధజ్యోతి): గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు హరిప్రసాద్‌, గోవర్ధన్‌రెడ్డిలు మువ్వన్నెల జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీఎస్‌ మూర్తి, వికాస్‌ హరిక్రిష్ణ, సుబ్బలక్షుమ్మ, అన్వర్‌హుసేన్‌, ఎంపీ సురేష్‌, జయచంద్ర, పీరయ్య, మాసాకోదండరామ్‌, జలతోటి జయకుమార్‌ పాల్గొన్నారు.


జనసేన కార్యాలయంలో...

కడప(సెవెన్‌రోడ్స్‌), జనవరి 26: నగరంలోని జనసేన కార్యాలయంలో మంగళవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన రాయలసీమ పార్లమెంటరీ జాయింట్‌ కన్వీనర్‌ సుంకర శ్రీనివాస్‌ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మాలే శివ, జనసేన నాయకులు రంజిత్‌, విజయ్‌ పాల్గొన్నారు.


డీఎ్‌ఫవో కార్యాలయంలో...

కడప(నాగరాజుపేట), జనవరి 26: నగరంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎ్‌ఫవో రవీంద్రదామా, సీఎ్‌ఫవో నాగరాజు జెండా వందనం స్వీకరించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో బాలసుబ్రమణ్యం, సెక్షన్‌ ఆఫీసర్స్‌ నాగరాజు, సిబ్బంది రాము, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు.


రెడ్‌క్రా్‌సలో... 

కడప(నాగరాజుపేట), జనవరి 26: నగరంలోని రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యాలయంలో మంగళవారం 72వ గణంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఛైర్మన్‌ అలపర్తి చౌదరి జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో అకౌంటెంట్‌ చంద్రశేఖర్‌, ఈసీ మెంబర్‌ జానమద్ది విజయభాస్కర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ తదితరులు పాల్గొన్నారు. 


కళాక్షేత్రంలో...

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 26: గణతంత్ర వేడుకల సందర్భంగా మంగళవారం నేక్‌నామ్‌ కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నృత్య ప్రదర్శన చేసిన విద్యార్ధినీ విద్యార్థులకు డీఈఓ శైలజ, సమగ్రశిక్ష ఏపీవో ప్రభాకర్‌రెడ్డి, కడప ఎంఈవో నారాయణ చేతులమీదుగా మెమెంటోలు ప్రదానం చేశారు.


Updated Date - 2021-01-27T05:26:58+05:30 IST