పనులు ఆగిపోయాయ్‌..!

ABN , First Publish Date - 2022-01-04T06:02:26+05:30 IST

కేంద్ర ప్రభుత్వం గ్రామ, పట్టణాలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంటుంది. రెండేళ్ల క్రితం కడప కార్పొరేషనకు కూడా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.45.38 కోట్లను కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో సుమారు రూ.12 కోట్ల పనులు చేపట్టినా ఇంకా

పనులు ఆగిపోయాయ్‌..!
ఆర్కే నగర్‌లో రోడ్డు దుస్థితి

14వ ఆర్థిక సంఘం నిధులు రూ.45.38 కోట్లతో

రెండేళ్ల క్రితం కార్పొరేషనలో 262 పనులకు టెండర్లు

రూ.12 కోట్ల పనులు మాత్రమే మొదలు

బిల్లులు రాకపోవడంతో పనులు చేయని కాంట్రాక్టర్లు

కడప, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం గ్రామ, పట్టణాలకు ఆర్థిక సంఘం నిధులు ఇస్తుంటుంది. రెండేళ్ల క్రితం కడప కార్పొరేషనకు కూడా 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.45.38 కోట్లను కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో సుమారు రూ.12 కోట్ల పనులు చేపట్టినా ఇంకా సుమారు రూ.6కోట్ల బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేయడం తమవల్ల కాదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. వెరసి అభివృద్ధి పనులు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. 


పనులు పూర్తి అయ్యేది ఎప్పుడో..?

కడప కార్పొరేషన పరిధిలో చాలా ప్రాంతాల్లో సరైన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆర్కేనగర్‌, రామాంజనేయపురం, ఆజాద్‌నగర్‌తో పాటు శివారు ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.45.38 కోట్లతో 262 పనులు చేపట్టాలని నిర్ణయించారు. సీసీ రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీతో పాటు లింగంపల్లి వద్ద రూ.40 లక్షల వ్యయంతో రెండు పంప్‌ హౌస్‌ నిర్మాణాలు చేపట్టేందుకు రెండేళ్ల క్రితం టెండర్లు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.6 కోట్ల విలువ చేసే పనులు మాత్రం పూర్తిఅయ్యి వాటికి బిల్లులు వచ్చాయి. మరో రూ.4.53 కోట్ల పనులు పూర్తి అయినా వాటికి బిల్లులు రాలేదు. ఇవన్నీ సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్‌ చేశారు. మరో రూ.1.32 కోట్ల పనులకు సంబంధించి బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం స్థానంలో 15వ ఆర్థిక సంఘం కూడా వచ్చింది.


బిల్లులు ఏవీ..

ఆర్థిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం కాంట్రార్లకు చెల్లించడం లేదు. దీంతో అప్పు చేసి పెట్టుబడి పెట్టి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం లబోదిబోమంటూ ఎదురుచూస్తున్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో మిగతా కాంట్రాక్టర్లు కూడా పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.


పనులు పూర్తి అయ్యేది ఎప్పుడో

ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు పూర్తయి ఉంటే తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలకు జనం ఇబ్బందుల నుంచి గట్టెక్కేవారు. లింగంపల్లెలో రూ.40 లక్షల వ్యయంతో రెండు పంప్‌ హౌస్‌ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఆ పనులు పూర్తయి ఉంటే ఇప్పుడు తాగునీటి సమస్య తలెత్తేది కాదు. చుట్టూ నీరున్నా శీతాకాలంలోనూ కడప నగర వాసులు నీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చెప్పుకొస్తున్నారు. ఇక ఆర్కేనగర్‌, కోఆపరేటివ్‌ కాలనీ, సంగంపేట, ఒక్కలపేట, ఆల్మా్‌సపేట మరికొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి కాలేదు. సుమారు 30కి పైగా పనులైతే ఇంతవరకు మొదలు పెట్టలేదని చెబుతున్నారు. జీవో నెంబర్‌ 93 ప్రకారం టెండర్లు వేసిన తరువాత గడువులోపు మొదలుపెట్టకపోతే రద్దు చేయవచ్చు. అయితే రెండేళ్లు పూర్తి అయినా కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టనప్పటికీ పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. గిట్టని వారి టెండర్లు రద్దు చేస్తున్నారనే విమర్శ ఉంది. 14వ ఆర్థి సంఘం కాలం ముగిసి 15వ ఆర్థిక సంఘం వచ్చినప్పటికీ ఇంకా సుమారు రూ.18 కోట్ల పనులు మొదలు కాకపోవడం గమనార్హం.

Updated Date - 2022-01-04T06:02:26+05:30 IST