దొంగ జపం కొంగ

ABN , First Publish Date - 2022-08-08T05:48:10+05:30 IST

ఒక ఊరిలో ఓ చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ కొంగ జపం చేస్తుంటే.. అక్కడికి ఓ నక్కవెళ్లింది. ‘నీళ్లల్లో నిలబడి జపం చేయి. దేవుడు త్వరగా కరుణిస్తాడు’ అన్నది నక్క.

దొంగ జపం కొంగ

ఒక ఊరిలో ఓ చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ కొంగ జపం చేస్తుంటే.. అక్కడికి ఓ నక్కవెళ్లింది. ‘నీళ్లల్లో నిలబడి జపం చేయి. దేవుడు త్వరగా కరుణిస్తాడు’ అన్నది నక్క. నీళ్లలోపలికి కొంగ వెళ్తుంటే.. చేపలు, కప్పలు, పీతలు భయపడి దాక్కున్నాయి. ‘మీకేమీ అపకారం చేయను. నేను జపంలో ఉన్నాను’ అన్నది. నీళ్లలో బతికే జీవులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ప్రతి రోజూ కొంగ చెరువులోకి వచ్చి రెండు, మూడు గంటలు జపం చేసి వెళ్తోంది. ఎవరినీ ఏమీ అనలేదు. వేటిని తినలేదు. కొంగ మంచితనాన్ని చూసి నక్క కూడా సంతోష పడింది. ఎండాకాలం రానే వచ్చింది. చెరువంతా ఎండిపోతోంది. అది చూసి కొంగ ఆనందానికి అవధుల్లేవు. ఒక రోజు చెరువులో జపం చేస్తూ.. ‘ఈ రోజు పెద్ద వర్షం పడుతుంది’ అన్నది కొంగ. దేవుడు చెప్పాడు అన్నది. ఆ రోజు అనుకోకుండా వర్షం పడింది. ఆ రోజునుంచి చేపలు, కప్పలన్నీ కొంగను గుడ్డిగా నమ్మటం మొదలు పెట్టాయి. ఆ తర్వాత పదిరోజుల్లో ఎండ మరింత తీవ్రమైంది. చెరువు ఎండిపోతోంది. జలచరాలన్నీ భయపడుతూ.. ‘కొంగ స్వామి. మేం ఏమి చేయాలి?’ అంటూ వేడుకున్నాయి. ‘దగ్గరలో ఒక నది చూశా. అది అన్ని కాలాల్లోనూ పారుతుంది. నీరు ఇంకదు’ అన్నది. ‘మమ్మలను తీసుకెళ్లండి.. ’అంటూ జీవులన్నీ బతిమలాడాయి. చేపలు, కప్పలు, పీతలు.. ‘మేం ముందు’ అంటూ కొట్లాడుకుంటున్నాయి.


ఒక్కోరోజు రెండు, మూడు చేపలను తీసుకెళ్తోంది కొంగ. ఆ చేపలను తన మిత్రులకూ భోజనం పెడుతోంది. ఆ తర్వాత రోజు ‘అదృష్టవంతులు’ మీరు అంటూ.. ఒక రోజు చేపలు, మరో రోజు కప్పలు, ఇంకో రోజు ఎండ్రకాయలను నదిలో వదుల్తానంటూ తీసుకెళ్తోంది. కడుపు నిండా ఆరగిస్తోంది. ఈ విషయం నక్క తెలుసుకుంది. ‘దొంగ జపం చేసి మోసం చేయటం తగదు’ అన్నది. నక్కబావా నువ్వా? నాకు చెప్పేది అన్నది. కొన్నాళ్ల తర్వాత తన స్నేహితులు కూడా సాయం చేస్తారని ఓ పది కొంగలను తీసుకొచ్చింది. ఆ కొంగ మాటలకు అందరూ నమ్మారు. నీళ్లలోని జీవులన్నీ ఎండాకాలం పూర్తవ్వకముందే కనిపించకుండా పోయాయి. 

Updated Date - 2022-08-08T05:48:10+05:30 IST