టీడీపీ వాళ్లమని పట్టాలు ఇవ్వరంట

ABN , First Publish Date - 2022-08-11T05:31:23+05:30 IST

‘మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వారమని ఇళ్ల పట్టాలివ్వరా?’ అని ఎస్‌.కోటకు చెందిన పలువురు మహిళలు ప్రశ్నించారు. బుధవారం వారు తహసీల్దార్‌ రామకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు.

టీడీపీ వాళ్లమని పట్టాలు ఇవ్వరంట
విలేకరులతో మాట్లాడుతున్న మహిళలు

ఎస్‌.కోట మహిళల ఆవేదన
లక్కవరపుకోట, ఆగస్టు 10:
‘మేము తెలుగుదేశం పార్టీకి చెందిన వారమని ఇళ్ల పట్టాలివ్వరా?’ అని ఎస్‌.కోటకు చెందిన పలువురు మహిళలు ప్రశ్నించారు. బుధవారం వారు తహసీల్దార్‌ రామకృష్ణను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. వారి వివరాల మేరకు.. ఎల్‌.కోట గ్రామానికి చెందిన పేదలకు రెండో విడతలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో పేదలను గుర్తించి జాబితాను అధికారపార్టీ నేతలకు అందజేశారు. నేతల పరిశీలనలో టీడీపీ సానుభూతిపరుల పేర్లు మాయమయ్యాయి. తమకు మద్దతు ఇస్తున్న వారి, వైసీపీ వర్గీయుల పేర్లతో జాబితారె అధికారులకు పంపించి ఆమోదింపజేశారు. విషయం తెలుసుకున్న మహిళలు బుధవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో తహసీల్దార్‌ను అడిగారు. మరోసారి పరిశీలిస్తామని తహసీల్దార్‌ చెప్పారు. ఇంతలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ తదితరులు వచ్చి బాధితులతో కలిసి తహసీల్దార్‌ను ప్రశ్నించారు. పేదలకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జాబితాలో ఉన్న పేర్లలో ఏ ఒక్కరూ పేదవారు కాదని, భూములు, ఇళ్లు ఉన్నవారేనని మహిళలు వాపోయారు.

Updated Date - 2022-08-11T05:31:23+05:30 IST