మా వాళ్లే.. టచ్ చేయొద్దు!

ABN , First Publish Date - 2022-05-31T06:42:18+05:30 IST

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అధికారులు టచ చేయలేకున్నారు

మా వాళ్లే.. టచ్ చేయొద్దు!
హౌసింగ్‌ బోర్డులో అనుమతి లేకుండా నిర్మిస్తున్న సెల్లార్‌

అనంతపురం క్రైం, మే 30: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ఎన్నో అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అధికారులు టచ చేయలేకున్నారు. అధికార పార్టీ వారి సహకారంతో కొందరు సిల్ట్‌ అనుమతి తీసుకుని సెల్లార్లు నిర్మిస్తున్నారు. అనుమతి లేకపోయినా, ఇష్టారాజ్యంగా భవనాలు నిర్మించి, ఎప్పుడో ఏళ్ల క్రితం అనుమతి తీసుకున్నామని బుకాయిస్తున్నారు. అధికారులు తనిఖీలకు వెళితే.. అధికారపార్టీ నాయకుల నుంచి వెంటనే ఫోనకాల్స్‌ వస్తున్నాయి. ‘మా వాళ్లవే. ఆ బిల్డింగ్‌లను టచ్ చేయొద్దు’ అని హుకుం జారీ చేస్తున్నారు. ఈ కారణంగా టౌన్ ప్లానింగ్‌ విభాగం పరిధిలో అక్రమ కట్టడాల సంఖ్య పెరుగుతోంది. నగరపాలిక కమిషనర్‌గా భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టి వారం కూడా గడవలేదు. టౌన ప్లానింగ్‌పై ఆ విభాగంవారితో సమీక్ష నిర్వహించనేలేదు. అప్పుడే ఒత్తిళ్లు మొదలయ్యాయి. టౌన ప్లానింగ్‌ విభాగంలో కొందరు అవినీతికి బాగా అలవాటు పడిపోయారు. వారి నుంచి, అధికారపార్టీ నుంచి కొత్త కమిషనర్‌కు అక్రమ కట్టడాల వ్యవహారంలో సవాల్‌ ఎదురౌతోంది. ఆ విభాగాన్ని దారిలో పెడతారా..? ఎందుకొచ్చిన గొడవ అని వదిలేస్తారా..? అన్న చర్చ నడుస్తోంది.


నిర్మాణమే పూర్తి కాలేదు..

రామ్‌నగర్‌ మంచి కమర్షియల్‌ ఏరియా. ఇక్కడ ఓ భవనంపై అనుమతి లేకుండా ఆరో అంతస్తు నిర్మిస్తున్నారని అధికారులు అడ్డుకున్నారు. అయినా నిర్మించడంతో పెద్ద వివాదంగా మారింది. భారీగా ముడుపులు పుచ్చుకుని వదిలేశారన్న ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఆ భవనానికి ఎదురుగా ఇప్పుడు మరో పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు. అది ఓ కీలక ప్రజాప్రతినిఽధి సమీప బంధువునకు చెందినదని తెలిసింది. పనులు ఇంకా పూర్తికాలేదు. కానీ ఈ భవనానికి 2013లోనే అప్రూవల్‌ ఇచ్చారట. ఆ తరువాత 2019లో బిల్డింగ్‌ పీనలైజేషన సిస్టమ్‌(బీపీఎ్‌స)కింద జరిమానా విధించారట. కానీ అప్రూవల్‌ కాపీ లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం. 2016 నుంచి ఆనలైన విధానం అమల్లోకి వచ్చింది. అనుమతి ఇచ్చిన తరువాత మూడేళ్లలోపే అది పూర్తవుతుంది. మళ్లీ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇక నిర్మాణమే పూర్తి కాని ఆ భవనానికి 2019లోనే బీపీఎస్‌ చేశారట. అక్రమ నిర్మాణం (డీవియేషన) ఉన్న వాటికే ఇలా చేస్తారు. ఈ విడ్డూరం వెనుక రాజకీయ ఒత్తిళ్లు బాగా ఉన్నట్లు తెలిసింది.  ఈ భవనం విషయంలో కొందరు అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు సమాచారం. 


మనోడేలే...

అనంతపురం నగరంలో సెల్లార్లకు అనుమతి లేదు. అయినా యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. పోనీ పార్కింగ్‌కి ఉపయోగిస్తున్నారా...? అంటే అదీ లేదు. కమర్షియల్‌గా వాడేసుకుంటున్నారు. నగరంలోని హౌసింగ్‌ బోర్డులో (విద్యుతనగర్‌ సర్కిల్‌ నుంచి నవోదయకాలనీకి వెళ్లే ప్రధాన రహదారి) ఓ భవనం నిర్మిస్తున్నారు. ఓ బైక్‌ షోరూమ్‌ ఎదురుగా ఉన్న ఈ భవనానికి, మొదట్లో రోడ్డు డ్యామేజ్‌ కావడంతో టౌనప్లానింగ్‌  అధికారులు  జరిమానాలు విధించారు.  ఆ తరువాత సెల్లార్‌ నిర్మిస్తుండటంతో ఆపడానికి వెళ్లిన అధికారులు, ఒత్తిడి చేయలేక పోయారట. ఉన్నతాధికారులకు అధికారపార్టీ కీలక నేతల నుంచి ఫోన్లు రావడమే ఇందుకు కారణమని సమాచారం. ‘మనోడేలే..! సెల్లార్‌ నిర్మిస్తే ఏమవుతుంది..? అలా చాలా కట్టారుగా.. వదిలేయండి. ఆ బిల్డింగ్‌ వద్దకు వెళ్లవద్దు’ అని ఆర్డర్స్‌ జారీ చేసినట్లు సమాచారం. 



ఆ బిల్డింగ్‌ను టచ్ చేయొద్దు..

నగరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ సమీపంలో ఓ పాఠశాల పక్కనే భవంతి నిర్మిస్తున్నారు. బాగా వ్యాపారం జరిగే పాన సెంటర్‌ యజమాని అతను. పాన బిజినె్‌సలో బాగా సంపాదించిన ఆయనకు అధికారపార్టీ నాయకులతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇక భవనం విషయాని కొస్తే, పాఠశాల పక్కనే ఏమాత్రం గ్యాప్‌ లేకుండా నిర్మించేశారు. అటువైపు సైతం అదే పరిస్థితి. కనీసం మనిషి పట్టేంత గ్యాప్‌ కూడా లేదు. ప్రతి భవనానికీ సెట్‌ బ్యాక్స్‌ (భవనం చుట్టూ కనీసం మూడు అడుగులు) తప్పనిసరి. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైౖరింజన ఆ భవనం చుట్టూ తిరగాలి. కానీ సైకిల్‌ కూడా వెళ్లలేదు. ఈ స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని అధికారులు ఆపే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. కానీ నో ఛాన్స..! ఆ పాన్ సెంటర్‌ యజమాని పెద్ద స్థాయిలోనే రెకమెండ్‌ చేసినట్లున్నాడు. ఆ బిల్డింగ్‌ మనోడిదే, టచ్ చేయొద్దు అని అధికార పార్టీ నాయకులు కొందరు నేరుగా ఫోన్ చేసినట్లు సమాచారం. 


కొత్త కమిషనర్‌కు సవాల్‌

నగర పాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మికి నగరంలో అక్రమ కట్టడాల వ్యవహారం సవాల్‌గా మారేలా కనిపిస్తోంది. ఆమె సి్ట్రక్ట్‌గా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వచ్చీ రావడంతోనే పారిశుధ్యంపై దృష్టి సారించారు. తెల్లవారుజామునే మస్టర్‌కు హాజరు  అవుతున్నారు. ప్రతి పనిపైనా సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. టౌన ప్లానింగ్‌ వ్యవహారాలపైనా ఇదే స్థాయిలో ప్రభావం చూపిస్తారా...? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? అన్న చర్చ జరుగుతోంది. 

Updated Date - 2022-05-31T06:42:18+05:30 IST