Abn logo
Jun 4 2021 @ 00:00AM

ఈ స్మార్ట్‌ వాచీలు ‘బ్రీతింగ్‌’ ఎక్స్‌పర్ట్‌లు

మోబైల్‌ ఫోన్‌ వచ్చిన తరవాత వాచీలు, కెమెరాలు, టేప్‌ రికార్డర్లు ఇలా ఎన్నింటినో మూలకు పడేసింది. దీంతో వాచీలు రూపుమార్చుకుని ముందుకు వస్తున్నాయి. ఇవి ఇప్పుడు స్మార్ట్‌పేరుతో హెల్త్‌ మానిటరింగ్‌ ఫీచర్లు కలుపుకుని వస్తున్నాయి. 


కొవిడ్‌ రోజుల్లో వీటిపై మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి హార్ట్‌ రేటు, బ్లడ్‌ సాచ్యురేషన్‌ లెవెల్స్‌ సహా వివిధ విషయాల్లో తోడ్పడే విధంగా సంబంధిత సెన్సర్లతో ఈ రోజు పలు స్మార్ట్‌ వాచీలు అందుబాటులో ఉన్నాయి. యాపిల్‌, గార్మిన్‌, ఫిట్‌బిట్‌ వాచీలు అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వస్తున్నాయి. ఒత్తిడి తగ్గించుకోవడం నుంచి ఊపిరితిత్తులను పటిష్టపర్చుకోవడం వరకు వివిధ విషయాల్లో సహకరిస్తున్నాయి. దరిమిలా బ్రీతింగ్‌ విషయంలో ఎంతగానో తోడ్పడుతున్న ఈ స్మార్ట్‌ వాచీలను చూద్దాం.


యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 9 (రూ.43,900 నుంచి)

1.78 ఇంచ్‌ల డిస్‌ప్లేతో 40ఎంఎం, 44 ఎంఎం సైజులతో ఉంది. 5సిహెచ్‌జెడ్‌ వైఫై, యుఐ అలా్ట్ర వైడ్‌ బ్యాండ్‌ చిప్‌ ఉన్నాయి. స్విమ్‌ ప్రూఫ్‌ డిజైన్‌కు తోడు రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, యోగా, స్విమ్మింగ్‌, డ్యాన్స్‌ విషయాల్లో సపోర్ట్‌ చేస్తోంది. ఆందోళన, భయంతో కూడిన దాడులకు సంబంధించిన విషయాలను డిటెక్ట్‌ చేస్తుంది. 

ఫాజిల్‌ జనరేషన్‌ 5 (రూ.22,995 నుంచి)

వేర్‌ ఓఎస్‌, గూగుల్‌ పవర్‌ కారణంగా బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను గైడ్‌ చేయగలుగుతుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజెస్‌లకు తగినది. ఇన్‌ బిల్ట్‌ జీపీఎస్‌ ఉంటుంది. స్విమ్‌ ప్రూఫ్‌ డిజైన్‌తో పాటు గూగుల్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ కూడా ఉంది. హార్ట్‌ రేటును ట్రాక్‌ చేయగలదు.

యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఇ (రూ.32,900 నుంచి)

40ఎంఎం, 44 ఎంఎం సైజులతో ఇది అందుబాటులో ఉంది. 64-బిట్‌ డ్యూయల్‌ కోర్‌ ఎస్‌5 ప్రాసెసర్‌ పవర్‌ కలిగిన ఈ వాచీ యాంటీ-ఫాల్‌ డిటెక్షన్‌ చేయగలదు. నిద్ర మొదలుకుని బ్రీత్‌ రిమైండర్ల సెట్టింగ్‌, హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌ చేయగలదు. 

గార్మిన్‌ ఫెనిక్స్‌ 6 ప్రొ సోలార్‌ (రూ.79,990 నుంచి)

1.4 ఇంచీల స్ర్కీన్‌, 280 ్ఠ 280 పిక్సెల్‌  రిజల్యూషన్‌ ఉన్నాయి. 32 జీబీ స్టోరేజీ, 10 ఏటీఎం వాటర్‌ రెసిస్టెన్స్‌ కూడా కలిగి ఉంది. రెస్పిరేటరీ ట్రాకింగ్‌కు తోడు యానిమేటెడ్‌ వర్కౌట్స్‌, రోజంతా హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, హైడ్రేషన్‌ అలాగే అడ్వాన్స్‌డ్‌ స్లీప్‌ ట్రాకింగ్‌ ఈ వాచీలో ఉన్నాయి. 

ఫిట్‌బిట్‌ వెర్సా 3 (రూ.18,900 నుంచి)

అలెక్సా బిల్ట్‌ ఇన్‌తో విడుదలైంది. బ్యాటరీ లైఫ్‌ ఆరు రోజులు. జీపీఎస్‌తో ఇంటిగ్రేట్‌ అయి ఉంటుంది. రోజంతా హార్ట్‌ రేటును మానిటర్‌ చేస్తుంది. బిల్ట్‌ ఇన్‌ మిక్‌(మైక్రోఫోన్‌), స్పీకర్‌ సహాయంతో బ్లూటూత్‌ని చేతుల ప్రమేయం లేకుండా ఉపయోగించుకోవచ్చు. 

గార్మిన్‌ వివోస్మార్ట్‌ 4 

స్మార్ట్‌ వాచీ (రూ.12,162 నుంచి)

గైడెడ్‌ బ్రీతింగ్‌ ఫీచర్‌ కలిగి ఉంది. ఓలెడ్‌ డిస్‌ప్లేతో పాటు 48్ఠ128 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఉంది. ఆర్‌ఈం స్లీప్‌తో అడ్వాన్స్‌డ్‌ స్లీప్‌ మానిటరింగ్‌, బ్లడ్‌లో ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ లెవెల్స్‌ను ట్రాక్‌ చేస్తుంది. వాకింగ్‌, రన్నింగ్‌, స్ర్టెంథ్‌ ట్రైనింగ్‌, యోగా తదితరాల్లోనూ సపోర్ట్‌ చేస్తుంది. 


అమేజ్‌ఫిట్‌ బిప్‌ యు(రూ.3,999 నుంచి)

1.43 హెచ్‌డి స్ర్కీన్‌తో లభ్యమవుతోంది. 60కి మించి స్పోర్ట్స్‌ మోడల్స్‌ ఉంటాయి. స్ట్రెస్‌ మానిటరింగ్‌కు తోడు బ్రీత్‌ ట్రైనింగ్‌నూ ఆఫర్‌ చేస్తుంది. హార్ట్‌ రేట్‌ మానిటరింగ్‌,  స్లీప్‌ ట్రాకింగ్‌, కాల్‌ నోటిఫికేషన్స్‌ దీన్లో ఉన్న ఇతర ఫీచర్లు.


శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌  యాక్టివ్‌ 2 (రూ.20,840 నుంచి)

1.4 ఇంచ్‌ల డిస్‌ప్లే, 380 ్ఠ 380 పిక్సెల్‌ రిజల్యూషన్‌, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌ కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 5.0 అంతకు మించి, ఐఓఎస్‌ 9 దాని కంటే ఎక్కువ ఉన్న వాటికి తగినది. స్ట్రెస్‌ మానిటరింగ్‌, బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లను కూడా ఆఫర్‌ చేస్తోంది.


నాయిస్‌ కలర్‌ఫిట్‌ ప్రొ 3 (రూ.4,499 నుంచి)

1.55 ఇంచీల హెచ్‌డి డిస్‌ప్లే, ఇన్‌ బిల్ట్‌ ఆక్సీమీటర్‌ ఫంక్షన్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఔస్‌ డివైస్‌లకు తగినది. స్లీప్‌ పాటర్న్స్‌, స్లీప్‌ బ్రీత్‌ క్వాలిటీని మానిటర్‌ చేస్తుంది. బ్రీత్‌ గైడ్‌ సపోర్ట్‌కు తోడు స్ట్రెస్‌ మానిటరింగ్‌, హర్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌కు తోడు స్విమ్‌ డిజైన్‌ ప్రూఫ్‌ కూడా ఉంది. 

రెడ్‌మీ స్మార్ట్‌ వాచ్‌ (రూ.3,999 నుంచి)

1.4 ఇంచీలు, టిఎఫ్‌టి ఎల్‌సీడీ స్ర్కీన్‌తో 11 స్పోర్ట్స్‌ మోడ్స్‌ని ఆఫర్‌ చేస్తోంది. గైడెడ్‌ బ్రీతింగ్‌ ఫీచర్లకు తోడు హార్ట్‌ రేట్‌ను మానిటర్‌ చేస్తుంది. ఔట్‌డోర్‌ ట్రాక్స్‌ కోసం బిల్ట్‌ ఇన్‌ జీపిఎస్‌/ గ్లాస్‌నోస్‌ ఉంది. 5.1 బ్లూటూత్‌ కనెక్టివిటీని ఆఫర్‌ చేస్తోంది.