ప్రభుత్వ లెక్కల్లో నలుగురే మృతి... 84 మందికి అంత్యక్రియలు!

ABN , First Publish Date - 2021-04-14T17:26:44+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కరోనా మృతుల సంఖ్యను...

ప్రభుత్వ లెక్కల్లో నలుగురే మృతి... 84 మందికి అంత్యక్రియలు!

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కరోనా మృతుల సంఖ్యను వెల్లడించడంలో మరోమారు ప్రభుత్వ డొల్లతనం కనిపించింది. ఇది 1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనను తలపిస్తోంది. మంగళవారం భోపాల్‌లోని భద్‌భద్, సుభాష్ నగర్‌ఘాట్‌లలో కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి మొత్తం 84 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. 


అయితే గడచిన ఐదు రోజుల్లో ప్రతీరోజు కనీసం 50 మృతదేహాలు స్మశానవాటికల వద్దకు తరలిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గడచిన ఐదు రోజుల్లో కరోనా కారణంగా కేవలం 10 మంది మాత్రమే మృతి చెందారని ప్రభుత్వం చెబుతోంది. అలాగే గడచిన 24 గంటల్లో మొత్తం 84 మృత దేహాలకు అంత్యక్రియలు జరగగా, ప్రభుత్వం భోపాల్‌లో కరోనా కారణంగా కేవలం నలుగురే మృతి చెందారని చెబుతోంది. 1984లో జరిగిన గ్యాస్ దుర్ఘటనలో కూడా మృతుల సంఖ్య విషయంలో ప్రభుత్వం సరైన లెక్కలు చూపించలేకపోయిందనే ఆరోపణలున్నాయి. కాగా రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 8,998 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విధంగా ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.



Updated Date - 2021-04-14T17:26:44+05:30 IST