Abn logo
Aug 3 2021 @ 23:29PM

పనుల్లో నాణ్యత ఉండాలి

వేంపల్లెలో వైఎస్సార్‌ పార్కును పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు

కలెక్టర్‌ విజయరామరాజు

వేంపల్లె, ఇడుపులపాయలలో అభివృద్ధి పనుల తనిఖీ


వేంపల్లె, ఆగస్టు 3: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. వేంపల్లె మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం కలెక్టర్‌ తనిఖీ చేశారు. మొదట వేంపల్లె పట్టణం కడప రోడ్డులోని వైఎస్సార్‌ పార్కులో జరుగుతున్న పనులను పరిశీలించారు. రూ.3.3 కోట్ల వ్యయంతో పార్కు సుందరీకరణ పనులు జరుగుతుండగా పరిశీలించి ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు. రోడ్డు నుంచి పార్కు మొత్తం కనిపించేలా బయటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. అక్కడి నుంచి జడ్పీ బాలుర హైస్కూల్‌, బాలికల హైస్కూల్‌ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడున్న గ్రౌండ్‌లో గ్రీనరీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాల్సిన పనుల గురించి, నెమళ్ల పార్కు, ఎకో పార్కు గురించి చర్చించారు. కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్‌రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, పంచాయతీరాజ్‌, టూరిజం తదితర అదికారులు పాల్గొన్నారు.