నిరుద్యోగులు చనిపోతున్నా కనికరం లేదు

ABN , First Publish Date - 2021-10-27T04:35:32+05:30 IST

కొట్లాడి తెచ్చుకున్న తెలం గాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు

నిరుద్యోగులు చనిపోతున్నా కనికరం లేదు
నిరాహార దీక్షలో షర్మిల, తిమ్మాపూర్‌ దీక్ష శిబిరం వద్ద కళాకారుల ధూంధాం..

  • సీఎం కేసీఆర్‌పై మండిపడిన వైఎస్‌ షర్మిల
  • తిమ్మాపురంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేసిన వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి


ఇబ్రహీంపట్నం / కందుకూరు : కొట్లాడి తెచ్చుకున్న తెలం గాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలాయని, కళ్ల ముందే చనిపోతున్నా సీఎం కేసీఆర్‌కు కనికరం లేదని వైఎస్‌ ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఏడో రోజు మంగళవారం కందుకూరు మండలం అగర్‌మియాగూడ నుంచి రెండు కిలో మీటర్లు నడిచి తిమ్మాపురానికి చేరుకున్నారు. అక్కడే షర్మిల నిరుద్యోగ నిరాహారదీక్ష చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లా డారు.  నిరుద్యోగం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒక టని, ఏడేళ్లలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందన్నారు. ఉద్యోగాలు కల్పించమని 54లక్షల మంది నిరుద్యోగులు ప్రభు త్వానికి దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకోని వారు ఇంకా ఎంతమందో లెక్కలేదని ఆమె అన్నారు. కొందరు నిరు ద్యోగులు సమాజంలో తలెత్తుకొని తిరగలేక, తల్లిదండ్రులకు భారం కాకూడదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఇవేమీ పట్టింపు లేదని విమ ర్శించారు. ఫాంహౌస్‌లో నిద్ర పోవడానికా కేసీఆర్‌ను ముఖ్య మంత్రిని చేసిందంటూ ఆమె ఎద్దేవా చేశారు. అర్హులైన 10 లక్షల మంది వివిధ కార్పొరేషన్లలో రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, కానీ వారిని ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదన్నారు. తిరిగి వైఎస్‌ సంక్షేమ పాలనను తెచ్చుకోవాలంటే కేసీ ఆర్‌ను గద్దె దించి.. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆశీ ర్వదించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షా శిబిరంలో ఇబ్రహీం పట్నం మున్సిపాలిటీ  శేరిగూడెంకు చెందిన నిరుద్యోగి రమ మాట్లా డుతూ.. ఉచిత స్కీంలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, ఉద్యోగాలు కల్పించ డంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆవేశపూరితంగా అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి నిరిష్టమైన విధానమంటూ లేదని, ఈ ప్రభు త్వాన్ని సాగనంపితేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. దీక్ష అనంతరం పాదయాత్ర మరో రెండు కిలోమీటర్లు కొనసాగి రాచు లూరు శివారుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కొండ రాఘవరెడ్డి, సత్యవతి, అమృతాసాగర్‌, చెరుకు శ్రీనివాస్‌, పెద్దబావి వేణు గోపాల్‌రెడ్డి, ఎడ్మ మోహన్‌రెడ్డి, చైతన్యరెడ్డి, కుమ్మరి కిష్ణయ్య పాల్గొన్నారు.



Updated Date - 2021-10-27T04:35:32+05:30 IST