కాంగ్రెస్‌లో కుటుంబతత్వం లేదు: సీనియర్ నేత ఖర్గే

ABN , First Publish Date - 2022-02-17T21:31:04+05:30 IST

కాంగ్రెస్ కుటుంబతత్వం ఏమీ లేదు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దేశం కోసం పనిచేయాలనుకునేవారే. రాజీవ్ గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అవ్వలేదు...

కాంగ్రెస్‌లో కుటుంబతత్వం లేదు: సీనియర్ నేత ఖర్గే

న్యూఢిల్లీ: కుటుంబ పార్టీయని కాంగ్రెస్‌పై విమర్శలు ఈరోజు కొత్త కాదు. విపక్షాలు వీలైనన్ని ఎక్కువసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించి కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని చూస్తుంటాయి. తాజాగా ఎన్నికలు జరగుతుండడంతో బీజేపీ సహా అనేక పార్టీలు కాంగ్రెస్‌ను కుటుంబతత్వ పార్టీయని విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అదంతా గతమని, ఇప్పుడు కాంగ్రెస్‌లో వారసత్వ రాజకీయాలు ఏమీ నడవడం లేదని, రాజ్యసభ కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు.


బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై గురువారం ఆయన స్పందిస్తూ ‘‘కాంగ్రెస్ కుటుంబతత్వం ఏమీ లేదు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు దేశం కోసం పనిచేయాలనుకునేవారే. రాజీవ్ గాంధీ తర్వాత ఆ కుటుంబం నుంచి ఒక్కరు కూడా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అవ్వలేదు. నిజానికి బీజేపీలోనే కుటుంబతత్వం ఉంది. కానీ వాళ్లను దాచి ఉంచడానికి మాపై బురద చల్లుతున్నారు’’ అని ఖర్గే అన్నారు.

Updated Date - 2022-02-17T21:31:04+05:30 IST