ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2022-07-07T06:05:32+05:30 IST

మహాత్మా గాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉపేందర్‌రెడ్డి అన్నారు.

ఉపాధి హామీలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు


 ప్రజావేదికలో మాట్లాడుతున్న ఉపేందర్‌రెడ్డి 


 జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి ఉపేందర్‌ రెడ్డి వెల్లడి

రామన్నపేట, జూలై 6: మహాత్మా గాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉపేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత ఆవరణలో ఏర్పాటు చేసిన 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ముఽఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మొక్కలు నాటడం వాటి పరిరక్షణతో పాటు వైకుంఠధామం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోమని అన్నారు. తప్పుచేసిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, సహాయ గ్రామీణాభివృధ్ధి శాఖ అధికారి శ్యామల, జిల్లా విజిలెన్స అసిస్టెంట్‌ అధికారి ఆదిత్య, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, గాదె జలంధర్‌రెడ్డి, పోలేశ్వర రాజు, ఝాన్సీ, కృష్ణవేణి, నవీన పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T06:05:32+05:30 IST