Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 07 Apr 2022 08:58:07 IST

పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో..

twitter-iconwatsapp-iconfb-icon
పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో.. ప్రతీకాత్మక చిత్రం

అనుకోకుండా ఏర్పడే పరిచయాలు.. ఒక్కోసారి అక్రమ సంబంధానికి దారి తీస్తుంటాయి. దీనివల్ల అప్పటి వరకు సాఫీగా సాగిన జీవితంలో ఒక్కసారిగా సమస్యలు వచ్చిపడుతుంటాయి. భార్యాభర్తల మధ్య అప్పటిదాకా ఉన్న ప్రేమ దూరమై.. పగ, ప్రతీకారాలు చోటు చేసుకుంటాయి. చివరకు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తుంటాయి. ఛత్తీస్‌గఢ్‌లో మహిళతో అతడికి ఏర్పడిన పరిచయం.. చివరికి సమస్యలకు దారి తీసింది.  మహిళతో కలిసి పారిపోయేందుకు సిద్ధపడుతుండగా.. దారి మధ్యలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌ జష్‌పూర్‌ పరిధి నారాయణపూర్‌కు చెందిన సోనూ యాదవ్ అనే వ్యక్తికి.. సమీప ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు తెలీకుండా ఆ మహిళ.. సోనూ యాదవ్‌ను కలుస్తూ ఉండేది. ఏడాదిగా వీరి వ్యవహారం గురించి ఎవరికీ తెలీదు. అయితే నెల క్రితం మహిళ భర్త..  లలిత్ రామ్ చౌహాన్‌‌కు ఈ విషయం తెలిసింది. దీంతో భార్యను గట్టిగా మందలించాడు. ఇంకోసారి అతడితో మాట్లాడొద్దంటూ హెచ్చరించాడు. అలాగే సోనూయాదవ్‌పై కూడా దాడి చేసి, తన భార్య జోలికి రావొద్దని చెప్పాడు. అయినా సోనూయాదవ్ మాత్రం ఆమెను కలవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో మార్చి 24న మహిళను కలిసి కొత్త సిమ్ కొనిచ్చాడు. భర్తకు తెలీకుండా ఫోన్లలో మాట్లాడుకునేవారు. అయితే సోనూయాదవ్.. సిమ్ ఇచ్చిన విషయాన్ని కొన్నాళ్ల తర్వాత మహిళ తన భర్తకు చెప్పింది.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

దీంతో ఎలాగైనా సోనూయాదవ్‌ను అంతమొందించాలని కుట్రపన్నాడు. ఇదే విషయాన్ని భార్యకు చెప్పి, ఆమెతో సోనూయాదవ్‌కు ఫోన్ చేయించాడు. ’’ఇద్దరం కలిసి పారిపోదాం.. వచ్చెయ్’’.. అంటూ మహిళ చెప్పడంతో సోనూయాదవ్ అందుకు అంగీకరించాడు. ఏప్రిల్ 3న రాత్రి మహిళ చెప్పిన ప్రాంతానికి బైక్‌పై వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లగానే మహిళ భర్త కూడా ఉండడంతో షాక్ అయ్యాడు.  రామ్ చౌహాన్‌‌, అతడి భార్య కలిసి ఒక్కసారిగా సోనూయాదవ్‌పై దాడి చేశారు. తీవ్రగాయాలవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. ఇంతకీ ఈ 24 ఏళ్ల యువతి ఏమైపోయింది..? అసలేం జరిగిందంటే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!videoకొత్త కోడలు చెప్పిందని రోజూ రాత్రి పాలు తాగుతున్న కుటుంబ సభ్యులు.. మూడో రోజు పొద్దున్నే లేచి చూస్తే..గుర్తు తెలీని అమ్మాయి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్.. సరదాగా చాటింగ్ మొదలు పెట్టాడు.. కానీ చివరకు షాకింగ్ ట్విస్ట్..రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..ఒక్క ఫోన్‌తో ప్రయాణికులను హడలెత్తించిన 12 ఏళ్ల పిల్లాడు.. ఎందుకిలా చేశావని రైల్వే పోలీసులు నిలదీస్తే.. వ్యభిచారం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న భర్త.. పోలీసులకు పట్టుబడ్డ మహిళ.. అతడి భార్యే అని తెలిసి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.