పసుపు రంగు తొలగించాలని పట్టు

ABN , First Publish Date - 2022-08-19T05:53:12+05:30 IST

సచివాలయ సిబ్బంది కోసం దాతలు నిర్మించిన మరుగుదొడ్ల భవనం పై భాగాన ఉన్న వాటర్‌ ట్యాంకుకు, దాన్ని నిలిపేందుకు నిర్మించిన సిమెంట్‌ దిమ్మెకు వేసిన పసుపు రంగు తొలగింపుపై కాకుటూరివారిపాలెంలో వి వాదం చోటుచేసుకుంది. స్థానిక అధికారపార్టీ నాయకు లు గురువారం పోలీసులు, అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రంగు తొలగించేందుకు రాగా గ్రామస్థులు అడ్డుకొని వారిని తిరిగి పంపించారు.

పసుపు రంగు తొలగించాలని పట్టు

 అధికారులపై వైసీపీ నేతల ఒత్తిడి 

పోలీసులను వెంటబెట్టుకొని వచ్చిన బృందం

అడ్డుకున్న గ్రామస్థులు, తీవ్ర వాగ్వాదాలు

కాకుటూరివారిపాలెంలో దాతలు నిర్మించిన ట్యాంకుపై వివాదం


కాకుటూరివారిపాలెం(టంగుటూరు), ఆగస్టు 18 : సచివాలయ సిబ్బంది కోసం దాతలు నిర్మించిన మరుగుదొడ్ల భవనం పై భాగాన ఉన్న వాటర్‌ ట్యాంకుకు,  దాన్ని నిలిపేందుకు నిర్మించిన సిమెంట్‌ దిమ్మెకు వేసిన పసుపు రంగు తొలగింపుపై కాకుటూరివారిపాలెంలో వి వాదం చోటుచేసుకుంది. స్థానిక అధికారపార్టీ నాయకు లు గురువారం  పోలీసులు, అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రంగు తొలగించేందుకు  రాగా గ్రామస్థులు అడ్డుకొని వారిని తిరిగి పంపించారు. 

కాకుటూరివారిపాలెంలో గ్రామ సచివాలయం సి బ్బంది, అలాగే వివిధ పనుల కోసం సచివాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం  కొందరు దాతలు సచివాలయానికి అనుబంధంగా మరుగుదొడ్లు నిర్మించారు. రూ. 5లక్షలు వెచ్చించి ఆధునిక సౌకర్యాలతో టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేశారు. రన్నింగ్‌ వాటర్‌ నిమిత్తం టాయ్‌లెట్స్‌ భవనం పైభాగాన వాటర్‌ ట్యాంకు ఏర్పాటు చేశారు. ఆ ట్యాంకు పెట్టేందుకు సిమెంట్‌ దిమ్మె నిర్మించారు. వా టికి పసుపు రంగు వేయించారు. అయితే ట్యాంకుకున్న పసుపు రంగు, అలాగే దిమ్మెకు పూసిన పసుపు రంగు ను తొలగించాలని చాలా కాలంగా స్థానిక అధికార పా ర్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే గ్రామస్థులు ఇందుకు అంగీకరించక పోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవల అధికార పార్టీ నాయకులు ట్యాంకు, దిమ్మెకున్న పసుపు రంగులు తొలగించాలని మండల అధికారులపై ఒత్తిడి పెంచారు. వీ రి ఒత్తిడి తట్టుకోలేక గురువారం ఉదయం ఈవోఆర్‌డీ జగదీష్‌, సచివాలయ కార్యదర్శి మాల్యాద్రిలు ఏఎస్సై శ్రీనివాసరావు, నలుగురు పోలీసులను వెంటపెట్టుకొని సచివాలయానికి చేరుకున్నారు. వీరు ట్యాంకు, దిమ్మెకున్న పసుపు రంగు తొలగించేందుకు ఉపక్రమించారు. దీంతో స్థానికులు అధికారుల ప్రయత్నాలను అడ్డుకొని వారితో వాదనకు దిగారు. దాతలు ఏర్పాటు చేసిన ట్యాంకు, సిమ్మెంటు దిమ్మెకున్న రంగులు తొలగించాలనడం సబబు కాదని, రంగులన్నది యాధృచ్ఛికంగా  వే శారు మినహా కావాలని చేయలేదని, ఇది  దాతలను అ వమానించడమేనని అధికారులతో వాదనకు దిగారు. ఇందుకు అధికారులు సమాధానం చెబుతూ.. కోర్టు ని బంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలపై పార్టీలకు సంబంధించిన రంగులు ఉండరాదని, అందుకే తక్షణమే వాటిని తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రభుత్వ కా ర్యాలయాలపై పార్టీల రంగులు ఉండకూడదన్న నిబంధన నిజమైతే రైతు భరోసా కేంద్రంతో పాటుగా గ్రామం లోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న మూడు రంగుల సంగతి ఏమిటి? అవి రాజకీయపార్టీ రంగులు కావా అని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. కా ర్యాలయాలపై ఉన్న రాజకీయ పార్టీ గుర్తులైన మూడు రంగులను ముందుగా తొలగించి వస్తే ట్యాంకుకున్న రంగు సంగతి చూస్తామని స్థానికులు వారికి తేల్చిచెప్పారు. అధికారులు, గ్రామస్థుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వీరి మధ్యన వాదనలు పెరగడంతో ఒక దశలో ఏమి జరుగుతుందోనని సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులు అందోళన చెందారు. అధికారులను పురిగొల్పి పంపిన అధికార పార్టీ నాయకులు సంఘట నా స్థలానికి దూరంగా ఉండి వీక్షించారు. ఈ హైడ్రా మా అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. చివరికి చేసేది లేక అధికారులు వచ్చిన దా రినే వెళ్లి పోయారు.

Updated Date - 2022-08-19T05:53:12+05:30 IST