Advertisement
Advertisement
Abn logo
Advertisement

20 ఏళ్ల క్రితం పెళ్లి.. భర్తకు విడాకులు.. ఒకేసారి ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

ఆమెకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. పెళ్లైన రెండు సంవత్సరాలకే భర్తకు విడాకులిచ్చింది.. అనంతరం ఓ వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది.. కొద్ది రోజుల అనంతరం ఆమెకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు.. అతనితోనూ బంధం ప్రారంభించింది.. ఈ విషయం మొదటి ప్రియుడికి తెలియడంతో ఆమెకు ఇబ్బందులు తలెత్తాయి.. దీంతో తన రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని హత్య చేసింది.. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడడంతో ప్రస్తుతం జైలు పాలైంది.. ఉత్తరప్రదేశ్‌లోని భరతనా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


భరతనాకు సమీపంలోని నాగ్లాపూత్ గ్రామానికి చెందిన రేష్మ అనే యువతికి 2001లో షహజాద్ అనే వ్యక్తితో వివాహమైంది. మరో రెండు సంవత్సరాలకు వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత రేష్మకు అనిల్ సింగ్ అనే యువకుడు పరిచయమమయ్యాడు. అతడితో రేష్మ సహజీవనం మొదలుపెట్టింది. వివాహం చేసుకోకుండానే వీరిద్దరూ కొద్ది సంవత్సరాలుగా ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రేష్మకు కమలేష్ నాథ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఒకవైపు అనిల్‌తో సహజీవనం చేస్తూనే కమలేష్‌తో కూడా రేష్మ బంధం కొనసాగించింది. 


ఆ బంధం గురించి అనిల్‌కు తెలియడంతో రేష్మను నిలదీశాడు. దీంతో అనిల్‌ను కడతేర్చాలని రేష్మ, కమలేష్ నిర్ణయించుకున్నారు. గత సోమవారం అనిల్‌కు బాగా మద్యం పట్టించి హత్య చేశారు. అనంతరం అనిల్‌ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మృతదేహం గురించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. అనిల్ సోదరుడు లఖన్ సింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. తన సోదరుడు రేష్మ అనే యువతితో చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని, ఈ హత్య వెనుక ఆమె హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. రేష్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో అసలు నిజం తెలుసుకున్నారు. రేష్మను, ఆమె బాయ్‌ఫ్రెండ్ కమలేష్‌ను అరెస్ట్ చేశారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement