Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 23 Dec 2021 21:54:17 IST

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

twitter-iconwatsapp-iconfb-icon
వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

ఒక్కోసారి చిన్న చిన్న తప్పులే.. చివరకు పెద్ద పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. యూకేలో ఓ కంపెనీ వారు చేసిన చిన్న తప్పు.. చివరకు ఓ మహిళకు తలనొప్పి తెచ్చిపెట్టింది. సాధారణంగా ఫోన్ మీద ఫోన్లు వస్తుంటే.. ఏంట్రా బాబూ తననొప్పి అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఓ మహిళకు రోజూ ఏకంగా 4500 ఫోన్లు రావడం మొదలెట్టాయి. దీంతో ఆమె తీవ్ర ఇబ్బందులకు గురైంది. చివరకు అసలు విషయం తెలిసి షాక్‌కు గురైంది..

వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా..

యూకేలోని ఉత్తర ఐర్లాండ్‌ బాంగోర్‌కు చెందిన హెలెన్‌ అనే మహిళకు ఉన్నట్టుండి ఫోన్ల మీద ఫోన్లు రావడం మొదలెట్టాయి. ఫోన్ చేసిన వారు తమ సమస్యలను ఏకరువు పెట్టడం మొదలెట్టారు. కొందరు తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయాలని, ఇంకొందరు కొత్త కొత్త ఆఫర్లను తెలియజేయాలని అడగడం మొదలెట్టారు. దీంతో ఒక్కసారిగా ఆ మహిళ ఖంగుతింది. అప్పటికీ కొందరి సమస్యలను పరిష్కరించిన ఆమెకు.. పదే పదే ఫోన్లు వస్తుండడంతో రాంగ్ నంబర్ అని చెప్పేసింది. చివరకు అసలు విషయం తెలిసింది.

ఆ చిన్నారి వయసు ఆరేళ్లు.. తన ఇంటి విలువ రూ.3.6కోట్లు.. ఎలా సాధ్యమైందో తెలుసా..

డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ అనే సంస్థ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ నెంబర్‌‌కు, ఈ మహిళ నంబర్‌కు చివరలో ఒకే నంబర్ తేడా ఉంది. ఆ కంపెనీ వారు కస్టమర్లకు నంబర్ ఇచ్చే క్రమంలో హెలెన్‌ బిజినెస్‌ కాంటాక్ట్‌ నెంబర్‌ని ఇచ్చారు. దీంతో ఆ కంపెనీకి రావాల్సిన ఫోన్లన్నీ ఈ మహిళకు వెళ్లడం మొదలెట్టాయి. చివరకు అసలు విషయం తెలుసుకుని ఆమె అవాక్కయింది. అనంతరం డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎకానమీ నిర్వాహకులు.. సదరు మహిళకు క్షమాపణలు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

స్మార్ట్‌ఫోన్‌కు బ్యాండు బాజాల మధ్య.. గుర్రపు బండిపై ఊరేగింపు.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లిచేసుకున్నారు... మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆఫీసుకు వెళితే.. అక్కడ ఊహించని సీన్..అర్ధరాత్రి రోడ్డుపై కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తాను పోలీసునంటూ యువతిపై సెల్ లైట్ వేసి.. చివరకు..65ఏళ్ల వృద్ధుడితో వివాహేతర సంబంధం.. ఉన్నట్టుండి మహిళ అదృశ్యం.. చివరగా వృద్ధుడు చెప్పిన కారణాలు విని..పెళ్లయి నెల కూడా కాకముందే పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. భర్త బలవన్మరణం.. షాకింగ్ నిజాలు చెప్పిన మరిదిజీవితాన్ని మార్చేసిన తొమ్మిది ప్రశ్నలు.. రూ.కోటి ప్యాకేజీతో జాబ్ ఇచ్చేందుకు Amazon అడిగిన ప్రశ్నలివే..!
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.