Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 28 Dec 2021 16:07:53 IST

భార్య అదృశ్యం.. కొన్ని రోజులకు భర్త తమ్ముడితో ప్రత్యక్షం.. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే..

twitter-iconwatsapp-iconfb-icon

ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఉండడంతో ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలూ లేవు. అయినా ఆమె మాత్రం సమస్యలను వెతుక్కుంటూ వెళ్లింది. పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా గడపాల్సిన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. భర్తకు తెలీకుండా ఆమె చేసిన పని.. చివరికి పిల్లలకు తల్లి ప్రేమను దూరం చేసింది. మరిది వరసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని, చివరకు పిల్లలను కూడా వదిలేసి వెళ్లిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

భార్య అదృశ్యం.. కొన్ని రోజులకు భర్త తమ్ముడితో ప్రత్యక్షం.. చివరకు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రశ్నిస్తే.. ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులోని కరూర్ జిల్లా కృష్ణరాయపురం సమీపంలోని పప్పనంపట్టి అనే గ్రామంలో గోవిందరాజ్, ప్రీతి(26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. వీరిలో చిన్న కూతురికి నాలుగు నెలల వయసు ఉంది. భర్త జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తూ కుంటుంబాన్ని పోషిస్తుండేవాడు. నెలల వయసున్న పాప ఆలనాపాలనా చూసుకుంటూ, కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాల్సిన ప్రీతి.. తప్పటడుగులు వేసింది. గోవిందరాజ్‌కు తమ్ముడు వరసయ్యే మణికందన్(22) అనే యువకుడు తరచూ వాళ్లింటికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ప్రీతికి బాగా దగ్గరయ్యాడు. భర్తకు తెలీకుండా రోజూ వచ్చి వళ్లేవాడు. ఇలా వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఉద్యోగం చేసి స్థిరపడతాడునుకుంటే.. అందరికీ షాక్ ఇస్తూ.. ఆ బీటెక్ స్టూడెంట్ ఇలా చేస్తాడనుకోలేదు..

ఈ క్రమంలో డిసెంబర్15న మణికందన్‌తో వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త.. ప్రీతి కనిపించకపోవడంతో చుట్టుపక్కల విచారించాడు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారిని చింతమణిపట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. అయితే ప్రీతి మాత్రం తనకు మణికందన్ అంటేనే ఇష్టమని, భర్తతో వెళ్లేది లేదని చెప్పేసింది. కనీసం చిన్న పిల్లలను చూసైనా మనసు మార్చుకుంటుందిలే అనుకున్న గోవిందరాజ్ ఆశలు.. అడియాశలయ్యాయి. పిల్లలను చూసినా ఆమె మనసు మాత్రం కరగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యూషన్‌లో ఉండాల్సిన బాలిక.. అనూహ్యంగా అటవీ ప్రాంతంలో.. అపస్మారక స్థితిలో.. జరిగిన ఘటన తెలుసుకుని అంతా షాక్..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఆమె చనిపోయి 11నెలలు అయింది.. ఊహించని విధంగా ఇటీవల కొడుకు గదిలో మృతదేహం ప్రత్యక్షం.. చివరకు..లక్షల విలువ చేసే వస్తువులను కొన్న యువతి.. తీరా ఇంటికి తీసుకొచ్చి తెరచి చూస్తే.. 35ఏళ్ల వ్యక్తిని అంకుల్ అని పిలవడమే.. ఆ బాలిక తప్పయింది.. చేతులు కట్టేసి ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే..భార్య పుట్టింటికి వెళ్లడంతో.. స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు.. అయితే వారే చివరికి ఇలా చేస్తారనుకోలేదు..వారు చేసిన ఒకే ఒక తప్పుతో.. ఆ మహిళ ఫోన్‌కు రోజూ 4,500 కాల్స్.. ఏంటిది అని విచారించగా.. పెళ్లికి నో చెప్పారని.. పెద్దలను ఎదిరించి బయటికెళ్లిన బావామరదళ్లు.. బస్సులో వెళ్తూ వాళ్లు చేసిన పనికి.. అంతా షాక్..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.